నా పెళ్లి తిరుపతిలోనే…!

Janhvi Kapoor on her wedding: It will be a traditional affair will happen in Tirupati, నా పెళ్లి తిరుపతిలోనే…!

ఒక్క సినిమాతోనే చాలా మంది అభిమానులను సంపాదించింది అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్. ఈ భామ తాజాగా ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్క్వూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. శ్రీదేవితో మీరెపుడైనా పెళ్లి గురించి మాట్లాడారా..అని జాన్వీని ప్రశ్నించారు. దీనికి జాన్వీ సమాధానమిస్తూ..పెళ్లి గురించి అమ్మతో మాట్లాడాను. అయితే మగవాళ్ల విషయంలో నా తీర్పుపై నమ్మకం లేదని అమ్మ చెప్పేది. అమ్మనే ఎవర్నో ఒకరిని ఎంపిక చేయాలనుకునేది. నేను ఎవరినైనా సులభంగా ప్రేమించడమే అందుకు కారణమని జాన్వీ చెప్పింది.

తనకు కాబోయే జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలేంటని జాన్వీని అడుగగా..అతనికి తను చేసే పని పట్ల అంకితభావం ఉండాలి. మంచి టాలెంట్ ఉండాలి. అతని దగ్గర నుంచి కొత్త విషయాలు నేర్చుకునేలా ఉండాలి. అంతేకాకుండా అందరిని నవ్వించే స్వభావం ఉన్నవ్యక్తి అయి ఉండాలని చెప్పింది. ఇక తన పెళ్లి సంప్రదాయ పద్దతిలో తిరుపతిలో జరుగుతుందని వెల్లడించింది జాన్వీ. అంతేకాదు సంప్రదాయ కంజీవరమ్ చీరను ధరిస్తా. మొత్తం దక్షిణాది వంటకాలతో నా పెళ్లి వేడుక ఉంటుందని చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *