జనసేన ఏకైక సింగం ఇతడే

Janasena wins in Razole, జనసేన ఏకైక సింగం ఇతడే

ఏపీలో జరిగిన ఎన్నికల బరిలో పవన్ కళ్యణ్  జనసేన ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటినుంచి రాష్ట్రంలో వన్ సైడ్  వీస్తోన్న వైసీపీ గాలి హోరులో కేవలం ఒక్కస్థానానికి మాత్రమే పరిమితమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఉత్కంఠ పోరులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాదరావు విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై కేవలం 1167 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి రాజేశ్వరరావుకు 47573 ఓట్లు రాగా.. రాపాకకు 48740 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో గట్టిపోటీ ఇచ్చిన టీడీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు 44690 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. కాగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గాజువాక, భీమవరం నుంచి పోటీలో దిగి ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *