అదుపు తప్పితే నేనే వస్తా.. రాపాక అరెస్ట్‌పై పవన్

తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15మందిని రాజోల్ పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎమ్మెల్యే రాపాకపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టడం సరికాదని పవన్ అన్నారు. ప్రజలు అడగడం వల్లే రాపాక మలికిపురం వెళ్లారని.. ఈ విషయంపై గోటితో పోయే దానికి గొడ్డలి వరకు తీసుకొచ్చారని ఆయన […]

అదుపు తప్పితే నేనే వస్తా.. రాపాక అరెస్ట్‌పై పవన్
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2019 | 5:34 PM

తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15మందిని రాజోల్ పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

ఎమ్మెల్యే రాపాకపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టడం సరికాదని పవన్ అన్నారు. ప్రజలు అడగడం వల్లే రాపాక మలికిపురం వెళ్లారని.. ఈ విషయంపై గోటితో పోయే దానికి గొడ్డలి వరకు తీసుకొచ్చారని ఆయన ఫైర్ అయ్యారు. శాంతిభద్రతలు సమస్యగా మారకుండా అధికార యంత్రాంగం పరిష్కరించాలని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన క్యాడర్, నేతలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఘటనపై పార్టీ నేతలతో సమీక్షిస్తున్నానని తెలిపిన పవన్.. పరిస్థితులు అదుపుతప్పితే తానే రాజోలు వచ్చి అండగా నిలుస్తానని చెప్పుకొచ్చారు.

కాగా మలికిపురంలో ఆదివారం సాయంత్రం పేకాటాడుతున్న తొమ్మిదిమందిని స్థానిక ఎస్సై కేవీ రామారావు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, ఆరు మోటారు సైకిళ్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాపాక, ఆయన అనుచరులు సంఘటనా స్థలంలో ఎస్సైతో గొడవపడ్డారు. ఈ క్రమంలో ఎస్సైపై రాపాక వాగ్వివాదానికి దిగారు. ఆ తరువాత తన అనుచరులతో కలిసి వెళ్లిన రాపాక.. పోలీస్ స్టేషన్‌పై రాల్లు రువ్వుతూ కిటికీ అద్దాలు పగలగొట్టారు. దీంతో వారందరిపై సెక్షన్ 143, 147, 148, 341, 427, 149, 3 కింద పీడీపీపీ యాక్ట్‌ మరియు క్రిమినల్‌ ఎమైండ్‌మెంట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?