ఏపీలో 28వ తేదీన పోరుబాటకు పిలుపునిచ్చిన జనసేన, రైతుల మేలు కోరే కొత్త వ్యవసాయ చట్టాలన్న నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ పోరుబాటకు రెడీ అయింది. ఈనెల 28వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు పిలుపునిచ్చింది. తూర్పుగోదావరి జి..

ఏపీలో 28వ తేదీన పోరుబాటకు పిలుపునిచ్చిన జనసేన, రైతుల మేలు కోరే కొత్త వ్యవసాయ చట్టాలన్న నాదెండ్ల మనోహర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 20, 2020 | 12:03 PM

ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ పోరుబాటకు రెడీ అయింది. ఈనెల 28వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు పిలుపునిచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ మేరకు వెల్లడించారు. వరదలు, తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏపీ రైతాంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ఆయన, కేంద్ర ప్రభుత్వం.. రైతులు మేలు కోరే కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చిందని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందికరంగా ఉన్న కొత్త వ్యవసాయ చట్టాలలో సవరణలు చేస్తున్నారని వివరణ ఇచ్చారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై పార్టీలో చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే మార్చి నాటికి పార్టీ క్రీయశీలక సభ్యత్వాల స్వీకరణ పూర్తి చేస్తామని, అనంతరం జనసేన పార్టీ కమిటీలను బూత్ స్థాయి వరకు నిర్మాణం చేస్తామని నాదేండ్ల చెప్పారు.