Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 58 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 158333. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86110. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 67692. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4531. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి నేడు రెండో రోజు మహానాడు కార్యక్రమం. ఉదయం 10గంటలకు ప్రారంభంకానున్న రెండో రోజు మహానాడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించనున్న టీడీపీ.
  • తిరుమల: నేడు టీటీడీ పాలక మండలి సమావేశం. లాక్ డౌన్ దృష్డ్యా మొదటిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనునన్న టీటీడీ బోర్డు సమావేశం. పది గంటలకు ప్రారంభం కానున్న సమావేశం. సిస్కో వెబ్ ఎక్స్ యాప్ ద్వారా సమావేశంలో పాల్గొననున్న బోర్డు సభ్యులు. 60 అంశాలతో ఎజెండా. నిరరార్ధక ఆస్తుల వేలం తీర్మానంపై కీలకంగా చర్చించనున్న బోర్డు. ప్రభుత్వ అదేశాలనంతరం భక్తులకు శ్రీవారి దర్శనం, వసతి సదుపాయాల కల్పన విధివిధానాలపై చర్చించనున్న పాలకమండలి టీటీడీ ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశం.
  • ఎన్టీఆర్ 97 వ జయంతి సందర్భంగా ఎన్టిఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన బాలకృష్ణ దంపతులు , సుహాసిని.
  • అమరావతి హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసు ఏడుగురు పై కేసులు నమోదు చేసిన సీఐడీ.. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు. విచారణకు హాజరు కావాలని పలువురికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ..
  • హైదరాబాద్ నగరంలో గురువారం నుంచి మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో ఒక షాపు తప్పించి మరో షాపు తెరిచే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఏర్పడుతున్నది. ఎక్కువ షాపులు తెరిచి, తక్కువ మంది పోగయ్యే విధానం అనుసరించాలని నిర్ణయించింది. షాపుల యజమానులు, వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం కోరింది.
  • కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇవాళ 107 పాజిటివ్ కేసులు నమోదు. * సౌదీ అరేబియా 49, వలస కార్మికులు 19 పాజిటివ్ కేసులు నమోదు. ఇవ్వాళ కొత్తగా 6మంది మృతి. ఇప్పటి వరకు మొత్తం 64కి చేరిన మృతుల సంఖ్య. ఇవాళ 37 మంది డిశ్చార్జి అయినట్లు వైద్యుల వెల్లడి. ఇప్పటి వరకు 1321 మంది డిశ్చార్జి.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. ఢిల్లీలో పవన్ బిజీ.. బిజీ..

ఎన్నికల్లో పొత్తులపై ఓ క్లారిటీ కోసం పవన్ హస్తినకు వెళ్లారు. బీజేపీ నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశంలో పవన్‌తో పాటు
Pawan Kalyan, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. ఢిల్లీలో పవన్ బిజీ.. బిజీ..

ఎన్నికల్లో పొత్తులపై ఓ క్లారిటీ కోసం పవన్ హస్తినకు వెళ్లారు. బీజేపీ నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశంలో పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్, బీజేపీ నేతలు జీవీఎల్, సునీల్ దేవ్‌ధర్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా, పురందేశ్వరి తదితరులు సైతం హాజరుకావాలని తొలుత నిర్ణయించారు. అయితే కన్నా బృందం ఢిల్లీ రాలేకపోయినందున టెలీకాన్ఫరెన్స్ ద్వారా కన్నాతో చర్చలు జరిపారు. తదుపరి విజయవాడలో ఆదివారం బీజేపీ – జనసేన మధ్య మరో దఫా చర్చలు జరుగనున్నాయి. జేపీ నడ్డా కుమారుడి వివాహ వేడుకకు పవన్, నాదెండ్ల హాజరుకానున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు సీట్ల సర్దుబాటు గురించి చర్చించుకున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ నెల 8న విజయవాడలో విస్తృత స్థాయిలో మరోసారి చర్చలు జరుపుతాం, 12న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని, ప్రజల ముందు సరైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలబడతామని స్పష్టంచేశారు.

Related Tags