Breaking News
  • సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ లో పనిచేస్తున్న సెక్షన్ అఫిసర్ కు కరోనా పాజిటివ్ గుర్తింపు.. ఇటీవల ఢిల్లీ వెళ్లాడని తెలిసి కరోనా టెస్టులు... టెస్టు చేసిన అనంతరం పాజిటివ్ గా వచ్చినట్లు గుర్తింపు.. గాంధీ ఆస్పత్రి కి తరలించిన అధికారులు.. బిఆర్కే భవనం మొత్తం షానిటైజేషన్ చేస్తున్న అధికారులు.
  • మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తబ్లీజ్ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
  • దేశవ్యాప్తంగా మొత్తం 1418 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఈ రోజే 167 పాజిటివ్ కేసులు నమోదు. దేశ వ్యాప్తంగా కరోనా తో 45 మంది మృతి. ఈ ఒక్క రోజే 13 మంది కరోనా తో మృతి చెందినట్లు వెల్లడి. కరోనా నుంచి 123 మంది డిశ్చార్జి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ.
  • ఉక్రెయిన్​లో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు. తిండి లేక ఆకలితోనే గడుపుతున్న విద్యార్థులు. చేతిలో చిల్లి గవ్వ లేక ఎన్నో ఇబ్బందులు. కరోనా రక్కసి మింగేస్తుందేమోననే భయంతో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు.
  • తెలంగాణ లో ఇప్పటి వరకు 97 కేసులు నమోదు. ప్రస్తుతం 77 మంది వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులు. ఈ ఒక్క రోజు 15 పాజిటివ్ కేసులు నమోదు. 14 మంది డిశ్చార్జ్,6 మృతి...

Janasena party: జనసేన మరో కీలక అడుగు.. పవన్ ఏం చేశారంటే!

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా సోమవారం కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. బీజేపీతో సమన్వయాన్ని దృష్టిలో వుంచుకుని పవన్ కల్యాణ్ కీలక అడుగు వేశారు.
janasena one more step ahead, Janasena party: జనసేన మరో కీలక అడుగు.. పవన్ ఏం చేశారంటే!

Janasena party a step ahead: జనసేన పార్టీగా ఆవిర్భవించి ఆరేళ్ళ గమనంలో మరో కీలక అడుగు పడింది. ఓ వైపు సినిమాల్లో తిరిగి నటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోవైపు ఏపీలో జనసేన పార్టీ పటిష్టతకు చర్యలు ముమ్మరం చేశారు.

జనసేన పార్టీ పార్లమెంటరీ కమిటీలను సోమవారం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఏపీలో మొత్తం 25 పార్లమెంటు స్థానాలుండగా.. వాటికి రీజియన్స్ వారీగా.. అయిదు కమిటీలను నియమించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయల దక్షిణ కోస్తా.. రాయలసీమ సంయుక్త కమిటీలలో పార్టీ సీనియర్ నాయకులను సభ్యులుగా చేరుస్తూ సంయుక్త పార్లమెంటరీ కమిటీల పేరుతో అయిదు కమిటీలను ఖరారు చేశారు.

జనసేన సంయుక్త పార్లమెంటరీ కమిటీల వివరాలు:

1 . ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీ: శ్రీకాకుళం, విజయనగరం, అరకు, విశాఖపట్టణం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా సుందరపు విజయ్ కుమార్ (యలమంచిలి), జాయింట్ కన్వీనర్‌గా గడసాల అప్పారావు (గాజువాక), సభ్యులుగా పరుచూరి భాస్కర రావు (అనకాపల్లి), పేడాడ రామ్మోహన్ (ఆమదాలవలస), డాక్టర్ బొడ్డేపల్లి రఘు (విశాఖపట్నం)గా ఉంటారు.

2 . గోదావరి సంయుక్త కమిటీ: కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, నరసాపురం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాలకు గోదావరి సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా మేడా గురుదత్ (రాజమహేంద్రవరం) శెట్టిబత్తుల రాజబాబు (అమలాపురం) జాయింట్ కన్వీనర్‌గా, సభ్యులుగా వేగుళ్ల లీలాకృష్ణ (మండపేట), బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం), యిర్రంకి సూర్యారావు (భీమవరం), గుణ్ణం నాగబాబు (పాలకొల్లు) సభ్యులుగా ఉంటారు.

3 . సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీ: విజయవాడ, మచిలీపట్టణం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ స్థానాలకు సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా కళ్యాణం శివ శ్రీనివాస్ (కె.కె., గుంటూరు), జాయింట్ కన్వీనర్‌గా సయ్యద్ జిలానీ (నరసరావుపేట), సభ్యులుగా పోతిన వెంకట మహేష్ (విజయవాడ), అమ్మిశెట్టి వాసు (విజయవాడ), గాదె వెంకటేశ్వర రావు (గుంటూరు), పాకనాటి రమాదేవి (గుంటూరు) సభ్యులుగా ఉంటారు.

4 . రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీ: తిరుపతి, చిత్తూరు, రాజంపేట, నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా డా.పసుపులేటి హరిప్రసాద్, షేక్ రియాజ్ జాయింట్ కన్వీనర్ గా, సభ్యులుగా డా. పొన్ను యుగంధర్ (గంగాధర నెల్లూరు), సయ్యద్ ముకరం చాంద్ (రాజంపేట), యగవింటి (మైఫోర్స్) మహేష్ (మదనపల్లి), మాసి కృష్ణమూర్తి (తిరుపతి), ఆరేటి కవిత (చిత్తూరు), శ్రీ గానుగపెంట శ్రీకాంత్ (నెల్లూరు) ఉంటారు.

5 . రాయలసీమ సంయుక్త కమిటీ: అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల, కడప పార్లమెంట్ నియోజకవర్గాలకు రాయలసీమ సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా టి.సి.వరుణ్ (అనంతపురం), సుంకర శ్రీనివాస్ (కడప) జాయింట్ కన్వీనర్‌గా, సభ్యులుగా చింతా సురేష్ (కర్నూలు), రేఖ గౌడ్ (ఎమ్మిగనూరు), ఆకుల ఉమేష్ (హిందూపురం), మలిశెట్టి వెంకటరమణ (కడప) ఉంటారు.

ఈ కమిటీలు మిత్రపక్షం బీజేపీ స్థానిక కమిటీలతో సమన్వయం చేసుకొంటూ ఉభయ పార్టీలు నిర్ణయించిన కార్యక్రమాల నిర్వహణ, పార్టీ అధ్యక్షుని ఆదేశాలను జిల్లా, మండల, పట్టణ, గ్రామ స్థాయి వరకూ అమలయ్యేలా చూడటం, కమిటీ పరిధిలో ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీని క్షేత్ర స్థాయి వరకూ పటిష్టం చేయడం లక్ష్యాలుగా పని చేస్తాయి.

Read this: Jagan anger on TDP cheap tricks టీడీపీ ట్రిక్కులపై జగన్ ఆవేదన, ఆగ్రహం

Related Tags