జగన్‌తో జనసేన ఎమ్మెల్యే భేటీ!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు భేటీ అయ్యారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే వరప్రసాద్ శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం అనంతరం సీఎం ఛాంబర్‌కు వెళ్లి జగన్మోహన్‌రెడ్డితో కాసేపు భేటీ అయ్యారు. అనంతరం సీఎం ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన వరప్రసాద్.. తాను మర్యాదపూర్వకంగానే సీఎం జగన్‌ను కలిశానని మీడియాకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన పార్టీ తరపున రాపాక వరప్రసాద్ రావు ఎమ్మెల్యేగా […]

జగన్‌తో జనసేన ఎమ్మెల్యే భేటీ!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 12, 2019 | 2:54 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు భేటీ అయ్యారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే వరప్రసాద్ శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం అనంతరం సీఎం ఛాంబర్‌కు వెళ్లి జగన్మోహన్‌రెడ్డితో కాసేపు భేటీ అయ్యారు. అనంతరం సీఎం ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన వరప్రసాద్.. తాను మర్యాదపూర్వకంగానే సీఎం జగన్‌ను కలిశానని మీడియాకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన పార్టీ తరపున రాపాక వరప్రసాద్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో ఆయన అధికార పార్టీ వైసీపీలో చేరబోతున్నారనే ఊహాగాలు వచ్చాయి. అయితే తాను జనసేనలోనే ఉంటానని ఇటీవలే వరప్రసాద్ స్పష్టం చేశారు.