ఈ పర్యటన ఉప ఎన్నిక కోసం కాదు.. క్లారిటీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్..

బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకే తమ పార్టీ అధినేతతో కలిసి ఢిల్లీ పర్యటనకు వచ్చామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏదో ఉప ఎన్నిక కోసం ఈ పర్యటన జరిగిందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని..

  • Ram Naramaneni
  • Publish Date - 6:50 pm, Wed, 25 November 20

బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకే తమ పార్టీ అధినేతతో కలిసి ఢిల్లీ పర్యటనకు వచ్చామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏదో ఉప ఎన్నిక కోసం ఈ పర్యటన జరిగిందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసమే తమ పర్యటన అని పేర్కొన్నారు. బీజేపీ, కేంద్రంలోని నేతలతో మంచి అంశాలపై చర్చ జరిగిందన్నారు.

అదే విధంగా బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ఏపీలో అధికారంలోకి ఎలా రావాలనే అంశాలపై చర్చించినట్లు మనోహర్ తెలిపారు. రాజధాని అమరావతి, పోలవరం అంశాలపైనా చర్చించామన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా పనులు ఉండాలి కానీ, అన్యాయం జరిగేలా ఉండకూడదని జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మనోహర్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రాజధానిని మార్చలేరుగా అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలనేది జనసేన నిర్ణయం అని మనోహర్ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ఆయన చెప్పుకొచ్చారు.