జనసేన నాయకుడు అన్యం గోవింద్ మృతి.. భావోద్వేగానికి గురైన పవన్

జనసేన పార్టీ నాయకుడు అన్యం గోవిందు అకాల మరణం చెందారు. కాగా ఆయన మృతికి.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గోవిందు మరణం.. పార్టీకి తీరని లోటని అన్నారు. విద్యాదాత, సమాజసేవకులు అయిన గోవిందు మృతి..

జనసేన నాయకుడు అన్యం గోవింద్ మృతి.. భావోద్వేగానికి గురైన పవన్
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2020 | 3:27 PM

జనసేన పార్టీ నాయకుడు అన్యం గోవిందు అకాల మరణం చెందారు. కాగా ఆయన మృతికి.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గోవిందు మరణం.. పార్టీకి తీరని లోటని అన్నారు. విద్యాదాత, సమాజసేవకులు అయిన గోవిందు మృతి తనను తీవ్రంగా బాధించిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామ చంద్రాపురం నియోజకవర్గంలోని కాజులూరు గ్రామానికి చెందిన ఆయన.. ప్రజల సంక్షేమం కోసం శ్రమించేవారని కొనియాడారు. గొప్ప మానవతా వాదిగా, విద్యాదాతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని, తన ఇంటిని జనసేన పార్టీ కార్యాలయంగా మార్చి వేసిన ఆయన పార్టీకి చేసిన సేవలు మరువరానివని అన్నారు. గోవిందు కుటుంబసభ్యులు తన తరపున, జనసేన నేతల తరపున సంతాపం తెలుపున్నామని పేర్కొన్నారు పవన్.

ఇవి కూడా చదవండి:జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

‘కరోనా వైరస్’ అంటూ జర్నలిస్ట్‌కి వేధింపులు.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

కరోనా వచ్చిందని భయపడుతున్నారా.. ఇలా తెలుసుకోండి!

తెలంగాణలో రేషన్ బియ్యం నిలిపివేత.. ఇదే కారణం..

ఏ లక్షణాలు లేకున్నా కరోనా వచ్చింది.. హైదరాబాద్ కోవిడ్ బాధితుడు చెప్పిన షాకింగ్ నిజాలు

జగన్ ప్రభుత్వానికి పవన్ మరో డిమాండ్.. ఈఎమ్‌ఐ చెల్లింపులు పొడిగించాలని..

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్