మంత్రి బొత్స ముఖ్యమంత్రిలా మాట్లాడుతున్నారు: పవన్

రెండు రోజుల పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ దిండిలో మీడియాతో మాట్లాడారు. రాజధాని మార్పుపై మంత్రి బొత్సా ముఖ్యమంత్రిలా మాట్లాడుతున్నారన్నారు. రాజధాని మార్పుపై బొత్స వ్యాఖ్యల్ని పవన్ ఖండించారు. ఐదేళ్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత రాజధానిని ఎలా తరలిస్తారని పవన్ ప్రశ్నించారు. అమరావతిలో ఇప్పటికే రూ.7వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని ఈ పరిస్థితిలో రాజధానిని తరలిస్తామంటే ఎలా ఉన్నారు పవన్. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని చెప్పామని, ఆంధ్రుల రాజధానిని గ్రీన్ క్యాపిటల్‌గా కట్టాలనేదే […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:48 pm, Fri, 6 September 19
Janasena chief Pawan on AP Capital Amaravathi change

రెండు రోజుల పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ దిండిలో మీడియాతో మాట్లాడారు. రాజధాని మార్పుపై మంత్రి బొత్సా ముఖ్యమంత్రిలా మాట్లాడుతున్నారన్నారు. రాజధాని మార్పుపై బొత్స వ్యాఖ్యల్ని పవన్ ఖండించారు. ఐదేళ్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత రాజధానిని ఎలా తరలిస్తారని పవన్ ప్రశ్నించారు.

అమరావతిలో ఇప్పటికే రూ.7వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని ఈ పరిస్థితిలో రాజధానిని తరలిస్తామంటే ఎలా ఉన్నారు పవన్. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని చెప్పామని, ఆంధ్రుల రాజధానిని గ్రీన్ క్యాపిటల్‌గా కట్టాలనేదే తమ డిమాండ్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిపై ప్రజల్లో తీవ్ర భయాలు నెలకొన్నాయని, ఇప్పటికే పోర్టులు, విమానాలు రద్దవుతున్నాయని, విమానాలు రద్దు అవుతున్నాయంటే పెట్టుబడులు రావడం లేదనే అర్ధమన్నారు. ఇప్పటి వరకు ఆలయాలకు నిధులు ఇవ్వడం లేదని, ఆలయాల్లో అర్చకుల కష్టాలు విస్మరించిందని ఆరోపించారు జనసేనాని.

మంత్రి బొత్స కాపు రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. రాజోలు ఎమ్మెల్యే రాపాక అరెస్టు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. పోలీసులు కూడా సంయమనంగా వ్యవహరించి ఉంటే బాగుండేదన్నారు పవన్ కళ్యాణ్.