చిరుకి తమ్ముడు కావడం దేవుడిచ్చిన వరంః పవన్

Pawan Wishes Chiranjeevi On His Birthday, చిరుకి తమ్ముడు కావడం దేవుడిచ్చిన వరంః పవన్

నాకు స్ఫూర్తి ప్రదాత చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. చిరంజీవి గారంటే కేవలం ఒక మెగాస్టార్ కాదని… మూర్తీభవించిన స్ఫూర్తిని ఆయన అభివర్ణించారు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా ‘పెద్ద కలలు కనడం, ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడడం’ అనే జీవనవేదానికి చిరంజీవిగారి ప్రస్థానం నిదర్శనమని అన్నారు. కలలు సాకారమై, శిఖరాలను అధిరోహించిన తర్వాత.. నిగర్వంగా, నిరాడంబరంగా ఉండడం.. తన మూలాలను మరచిపోని స్పృహతో ఉండడం… లాంటి జీవన విలువలకు చిరంజీవి ప్రతీకగా నిలుస్తారని పవన్ కితాబు ఇచ్చారు. ఇలాంటి గొప్ప వ్యక్తికీ తాను తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరమని చెప్పారు. చిరంజీవి గారి పుట్టినరోజు అభిమానులకు పండగ రోజని.. ‘సైరా’ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని పవన్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *