Breaking News
  • సీఎం జగన్‌ సైకో ఇజం చూపిస్తున్నారు-నారా లోకేష్‌. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. డీజీపీ ఆఫీస్‌ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి కేసులు పెట్టిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి-నారా లోకేష్‌.
  • ప.గో: జీలుగుమిల్లి మండలం తాటియకులగూడెంలో విషాదం. చెరువులో మునిగిపోతున్న కుమారుడిని కాపాడబోయి తండ్రి గల్లంతు. తండ్రి కృష్ణ, కుమారుడు దుర్గాప్రసాద్‌ మృతి.
  • అనంతపురం: అగలి మండలం నరసంభూదిలో భూవివాదం. పరస్పరం కత్తితో దాడి చేసుకునేందుకు అన్నదమ్ముల యత్నం. అడ్డుకునేందుకు యత్నించిన బీజేపీ నేత చంద్రశేఖర్‌కు గాయాలు. హిందూపురం ఆస్పత్రికి తరలింపు.
  • రంగారెడ్డి: తక్కుగూడ దగ్గర రోడ్డు ప్రమాదం. డివైడర్‌ను ఢీకొన్న మార్బుల్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ. ఒకరు మృతి, ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతోనే డివైడర్‌ను ఢీకొన్న లారీ.
  • పార్టీ మారతారన్న వార్తలపై స్పందించిన మంత్రి ఈటల. నేను పార్టీ మారను-మంత్రి ఈటల. గాలి వార్తలపై నేను స్పందించను. చెప్పే వాళ్లు ఎన్నైనా చెప్తారు-మంత్రి ఈటల.
  • సుజనాచౌదరి వ్యాఖ్యలకు మంత్రి మోపిదేవి కౌంటర్‌. గోడ దూకే ఎంపీలెవరూ వైసీపీలో లేరు. జగన్‌పై ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. తిరుమలను ఆర్ధిక వనరుగా భావించే ఆలోచన ప్రభుత్వానికి లేదు -మంత్రి మోపిదేవి వెంకటరమణ.

హరిద్వార్‌‌లో పవన్ కల్యాణ్.. ఏం చేశాడంటే..?

Janasena Chief Pawan Kalyan visits Matri Sadan Ashram in Haridwar, హరిద్వార్‌‌లో పవన్ కల్యాణ్.. ఏం చేశాడంటే..?

పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం హరిద్వార్‌లో పర్యటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నా.. ఇచ్చిన మాటకు కట్టుబడి హరిద్వార్‌ వెళ్లారు. గత రెండ్రోజుల నుంచి ఆయన హరిద్వార్, రిషికేశ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు ఆయన ఉదయాన్నే గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హరిద్వార్‌లోని సాధారణ హోటల్ రూమ్‌లో ఆయన బస చేసి.. స్థానిక ఆశ్రమంలో ఆకులో అల్పాహారం, భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గంగా ప్రక్షాళన కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. అందుకు అనుగుణంగా ప్రజల నమ్మకాలు, విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని నడుచుకుంటానన్నారు.

గంగా నదిని కాలుష్యానికి గురికాకుండా మన సంస్కృతిని పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై స్థానికులతో చర్చించారు పవన్ కళ్యాణ్. దేశంలో రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా.. ఎందరు రాజకీయ నాయకులు ఉన్నా.. దేశ సంస్కృతిక వైభవాన్ని ఎవరూ ధ్వంసం చేయలేరని అన్నారు పవన్ కల్యాణ్. గంగానది ప్రక్షాళన కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి మద్దతు రావడంలేనందు వల్లే.. ఆ లోటును తీర్చాలని మాత్రి సదన్ ఆశ్రమ ప్రతినిధులు తనను కోరారని.. అందుకనే.. నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చానని తెలిపారు పవన్ కల్యాణ్.