యురేనియం పై జనసేన పోరాటం.. టీఆర్ఎ‌స్‌ను టార్గెట్ చేశారా..?

Pawan Kalyan Opposes Uranium Mining In Telangana, యురేనియం పై జనసేన పోరాటం.. టీఆర్ఎ‌స్‌ను టార్గెట్ చేశారా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు చూస్తే.. తెలంగాణ రాజకీయాల్లో కలుగజేసుకుంటున్నారా..? తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీని తీసుకురావాలనుకుంటున్నారా..? మళ్లీ తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్నారా..? అఖిల పక్ష నేతలతో పవన్ భేటీ కావడం వెనుక కారణాలేంటి..? అసలు యురేనియంకి పవన్ కళ్యాణ్‌కి సంబంధమేంటి..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇప్పటిదాకా ఏపీ రాజధాని అమరావతి గురించి తన వాయిస్ వినిపించిన జనసేనాని.. తాజాగా యురేనియం వివాదం పై స్పందించారు. నల్లమల చెంచులపై ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. అంతేకాదు నల్లమల యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చెంచు నాయకుడు మల్లిఖార్జున్‌ కూడా హాజరయ్యారు. ఆయన మాట్లాడిన వీడియోను రిలీజ్ చేస్తూ అసలు చెంచు తెగలను భారతీయులుగా గుర్తిస్తున్నామా..? అని ట్విట్టర్ వేదికగా పవన్ ప్రశ్నించారు. అసలు ఈ భూమి మీద అత్యంత ప్రజాస్వామ్యయుతమైన వ్యక్తులు వారే అని చెప్పారు. అంతేకాకుండా యురేనియం తవ్వకాలతో జరిగే అనర్థాలపై రచించిన అణుధార్మి సత్యలు అనే పుస్తకాన్ని కూడా అఖిలపక్షం సమావేశంలో ఆయన విడుదల చేశారు.

ఇదిలా ఉంటే జనసేనాని యురేనియం పోరాటం పై పలువురు రాజకీయ నేతలు స్పందించారు. పవన్ చేస్తున్న పోరాటానికి ప్రశంసలు కురిపించారు. ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పవన్ ముందుకు రావడం ఆదర్శనీయంగా ఉందన్నారు. సమాజానికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు యురేనియం తవ్వకాల వల్ల ప్రభుత్వాలకు ఆర్థిక లాభాలు వచ్చినా.. అది ప్రకృతికి ప్రమాదమని పవన్ తెలిపారు. ప్రకృతిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నవారికి.. ఉపాధి లేకుండా పోతుందని ఆయన స్పష్టం చేశారు. తరతరాలుగా అడవులను నమ్ముకుని.. అక్కడే జీవిస్తున్న వారికి ద్రోహం చేసినట్లవుతుందని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు నేతలు తమ సొంత ప్రయోజనాల కోసం ప్రకృతిని బలిపశువుగా వాడుకుంటున్నారని పవన్ మండిపడ్డారు. ప్రజల సంక్షేమాన్ని పణంగా పెట్టి ప్రభుత్వాలు లాభం పొందాలని చూస్తే ఉరుకోబోమని జనసేనాని హెచ్చరించారు. తాజాగా యురేనియం తవ్వకాలపై తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. గతంలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చి.. ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు.

అసలు పవన్ కళ్యాణ్, అఖిల పక్ష నేతలను కలవడం చర్చనీయాంశం అయింది. వారిని కూడా యురేనియం పై పోరాటానికి సిద్దం చేయబోతున్నారా..? టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీని ముందుకు తీసుకురాబోతున్నారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు అఖిలపక్ష భేటీలో కేటీఆర్ వ్యాఖ్యలను పాయింట్‌గా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం పై ఓ రేంజ్‌లో విమర్శలు చేశారు. ఇంతకీ.. జనసేనాని యురేనియం పోరాటం ఏ పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి మరి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *