హస్తినకు సేనాని..వ్యూహంతో రె’ఢీ’నా..?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయలు దేరారు. ఏపీలోని మూడు రాజధానుల అంశానికి సంబంధించి ఆయన కేంద్రంలోని పెద్దలను కలసి చర్చించనున్నారు. పవన్ వెంట సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. గురువారం మధ్యాహ్నం వరకు వీరు అక్కడే ఉండనున్నారు. అద్భుతాలు జరుగుతాయని చెప్పను కానీ, మన బాధలను పెద్దల దృష్టికి తీసుకెళ్తానని ఇటీవల పవన్ రాజధాని మహిళల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో ప్రధానితో పాటు హోం […]

హస్తినకు సేనాని..వ్యూహంతో రె'ఢీ'నా..?
Follow us

|

Updated on: Jan 22, 2020 | 1:12 PM

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయలు దేరారు. ఏపీలోని మూడు రాజధానుల అంశానికి సంబంధించి ఆయన కేంద్రంలోని పెద్దలను కలసి చర్చించనున్నారు. పవన్ వెంట సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. గురువారం మధ్యాహ్నం వరకు వీరు అక్కడే ఉండనున్నారు. అద్భుతాలు జరుగుతాయని చెప్పను కానీ, మన బాధలను పెద్దల దృష్టికి తీసుకెళ్తానని ఇటీవల పవన్ రాజధాని మహిళల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో ప్రధానితో పాటు హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో పవన్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏపీలో బీజేపీ, జనసేన భవిష్యత్ కార్యచరణపై ఈ సమావేశాల తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం ఢిల్లీ చేరుకున్నారు. ఈ రెండు పార్టీల మధ్య ఢిల్లీలో తొలిసారి సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. రాజధాని తరలింపును ఎలాగైనా అడ్డుకుంటానంటున్న పవన్.. ఢిల్లీ వెళ్లి ఎలాంటి న్యూస్‌తో వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.