Breaking News
  • తూర్పుగోదావరి: రైతు సదస్సులో జనసేన కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీకు క్రమశిక్షణ లేదంటూ కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయానన్న పవన్
  • ఢిల్లీ అగ్నిప్రమాదంపై క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు. ఫ్యాక్టరీ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు. పరారీలో ఫ్యాక్టరీ యజమాని. వారం రోజుల్లో విచరాణ పూర్తి చేయాలని ఆదేశాలు
  • అమరావతి: ఈ నెల 23 నుంచి కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన. మూడు రోజులపాటు పర్యటించనున్న వైఎస్‌ జగన్‌. జమ్మలమడుగు, పులివెందుల, కడప, మైదుకూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్న జగన్‌
  • అనంతపురం: సాకే పవన్‌ చేసిన వ్యాఖ్యలకు జనసేన మద్దతు. సాకే వ్యాఖ్యలను సమర్థించిన అనంతపురం జనసేన నేతలు. రెడ్డి సంఘం నేతలపై జనసేన నేతల ఆగ్రహం
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • మాజీ ఎంపీ కవితకు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం. ఐఎస్‌బీలో ఇండియన్‌ డెమక్రసీ ఎట్‌ వర్క్‌ సదస్సుకు ఆహ్వానం. జనవరి 9, 10 తేదీలలో జరగనున్న సదస్సు. మనీ పవర్‌ ఇన్‌ పాలిటిక్స్‌ అంశంపై ప్రసంగించనున్న కవిత
  • తూ.గో:జనసేన రైతు సదస్సును ముట్టడించిన ఎమ్మార్పీఎస్‌. పవన్‌ రైతు సదస్సులోకి చొచ్చుకొచ్చిన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు. అడ్డుకున్న జన సైనికులు, ఇరువురి మధ్య తోపులాట. సమస్యలపై పవన్‌తో మాట్లాడాలంటూ వాగ్వాదం

జగన్‌కు జనసేనాని డెడ్‌లైన్.. రెండు వారాల్లో స్పందించకపోతే..

Pawan Kalyan Deadline To CM Jagan Over Sand Shortage, జగన్‌కు జనసేనాని డెడ్‌లైన్.. రెండు వారాల్లో స్పందించకపోతే..

ఏపీలో ఇసుక కొరతపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ విజయవంతమైనది. పవన్ కళ్యాణ్‌‌తో పాటు పలువురు విపక్ష పార్టీల నేతలు ఈ కవాతులో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే లాంగ్ మార్చ్ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో జగన్ సర్కార్‌పై సేనాని నిప్పులు చెరిగారు. ఇప్పటివరకు 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారని.. వారి కుటుంబాలు రోడ్డున పడడానికి ప్రభుత్వమే కారణమని పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా సీఎం జగన్‌కు రెండు వారాల డెడ్ లైన్ విధించిన పవన్ కళ్యాణ్… ఆలోపు భవన కార్మికులు ఒక్కొక్కరికి రూ.50 వేలు ఇవ్వాలని.. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఒకవేళ డెడ్‌లైన్ లోపు ప్రభుత్వం స్పందించకపోతే అమరావతి వీధుల్లో నడిచి నిరసన వ్యక్తం చేస్తానని.. పోలీసులను పెట్టుకున్నా.. ఆర్మీని పిలిపించుకున్నా.. ఎవరు ఆపుతారో చూస్తామని హెచ్చరించారు. కూల్చివేతలతో మొదలుపెట్టిన వైసీపీ ప్రభుత్వం కూడా కూలిపోతుందని సేనాని ధ్వజమెత్తారు. అటు విజయసాయిరెడ్డిపై కూడా విమర్శలు చేసిన పవన్.. పరిధి దాటితే తాట తీస్తానంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. కాగా, తమ డిమాండ్లను రెండు వారాల్లో పూర్తి చేయకపోతే.. తమ భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. అటు తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల కోసం విపక్షాలన్నీ ఒకతాటి మీదకు వచ్చాయని.. ఏపీలో భవన నిర్మాణ కార్మికుల కోసం కూడా అఖిలపక్షం కదిలిరావాలని సూచించారు. మరి జనసేనాని విధించిన డెడ్‌లైన్‌కు జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.