Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

ఏపీకి అమరావతే శాశ్వత రాజధాని: పవన్ కల్యాణ్

AP capital row: Pawan Kalyan urges Centre to support Amaravathi farmers, ఏపీకి అమరావతే శాశ్వత రాజధాని: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతేనని జనసేనాని పవన్ మరోసారి స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే వేడుకలను మొదట విశాఖపట్నంలో నిర్వాహించాలనుకున్న ప్రభుత్వం..తిరిగి వెనక్కి తగ్గి విజయవాడకు మార్చాలనుకున్నారని గుర్తు చేశారు. అమరావతి విషయంలో కూడా ప్రభుత్వ ధోరణి అదే అని ఆయన స్పష్టం చేశారు. రాజధానిని షిప్ట్ చెయ్యడం అంత ఈజీ విషయం కాదన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో గవర్నమెంట్స్ మాత్రమే మారుతున్నాయని, వాటి పనితీరు మాత్రం మారడం లేదని ఆక్షేపించారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక నిధులు వస్తున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం వాటిని సరిగ్గా వినియోగించడం లేదని పేర్కొన్నారు.

AP capital row: Pawan Kalyan urges Centre to support Amaravathi farmers, ఏపీకి అమరావతే శాశ్వత రాజధాని: పవన్ కల్యాణ్

కేంద్ర ప్రభుత్వ సమ్మతితోనే రాజధానిని మారుస్తున్నట్టు వైసీపీ చెప్తోందని, మూడు రాజధానుల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్‌కు అస్సలు సంబంధం లేదని పవన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పేరును కూడా వైసీపీ భ్రష్టు పట్టిస్తుందన్న పవన్..నిర్మలా సీతారామన్‌తో పలు కీలక విషయాలు చర్చించానని తెలిపారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తన పద్దతిని మార్చుకోవకపోతే..తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అమరావతిలో మహిళలు, రైతులను తీవ్రంగా హింసించారని, కేంద్ర మంత్రుల వద్ద ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తానన్నారు. బీజేపీతో కలిసి కూలంకషంగా చర్చించి బలమైన కార్యచరణ ప్రకటిస్తానని పవన్ తెలిపారు.

 

Related Tags