అగ్నికుల క్షత్రీయులను మరిచిపోయారా..!

అంతర్వేది నూతన రథం నిర్మాణంపై జనసేన చీఫ్ స్పందించారు. అంతర్వేది లక్ష్మీనారసింహుని ఆలయానికి నూతన రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులకు ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. అంతర్వేది లక్ష్మీనారసింహుని...

అగ్నికుల క్షత్రీయులను మరిచిపోయారా..!
Follow us

|

Updated on: Sep 24, 2020 | 1:33 PM

అంతర్వేది నూతన రథం నిర్మాణంపై జనసేన చీఫ్ స్పందించారు. అంతర్వేది లక్ష్మీనారసింహుని ఆలయానికి నూతన రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రీయులకు ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. అంతర్వేది లక్ష్మీనారసింహుని ఆలయానికి నూతన రథం నిర్మాణంలో ప్రభుత్వం ఆలయ సంప్రదాయాలు, స్థానికుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశారు జనసేనాని.

అంతర్వేదిలో లక్ష్మీ నరసింహుడిని అగ్ని కులక్షత్రీయులు తమ కుల దైవంగా పూజిస్తుంటారని.. ఈ ఆలయాన్ని అగ్నికుల క్షత్రీయుడైన కొపనాతి కృష్ణమ్మ నిర్మించిన సంగతి ఆయన ప్రభుత్వానికి గుర్తు చేశారు. తొలి రథం కూడా కృష్ణమ్మ రూపొందించినదే అని తన ప్రకటనలో పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరిన ఆ రథం స్థానంలో ఇటీవల అగ్నికి ఆహుతి అయిన రథం కూడా స్థానిక అగ్నికుల క్షత్రీయులు తయారుచేసినదే అని అన్నారు.

ఇప్పుడు కొత్త రథం నిర్మాణంలో వారికి ప్రాధాన్యత లేకపోవడంపై అగ్నికుల క్షత్రీయ సంఘం వారు ఆవేదన చెందుతున్నారని వెల్లడించారు. రథం రూపకల్పన కమిటీలో అగ్నికుల క్షత్రీయులకు ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రథోత్సవం నాడు తొలి కొబ్బరికాయ కొట్టి రథాన్ని లాగేది అగ్నికుల క్షత్రీయులే అని… వారి మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. వారిని గౌరవిస్తూ రథం తయారీలో అగ్నికుల క్షత్రీయులను భాగస్వాములను చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!