ప్రభుత్వ నిర్ణయంపై నిరసన.. 25న జంషెడ్‌పూర్ బంద్..

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించే వారికి లక్ష రూపాయల జరిమానాతోపాటు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామన్న ఝార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయంపై

ప్రభుత్వ నిర్ణయంపై నిరసన.. 25న జంషెడ్‌పూర్ బంద్..
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 8:28 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించే వారికి లక్ష రూపాయల జరిమానాతోపాటు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామన్న ఝార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని, సామాజిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఝార్ఖండ్ పారిశ్రామిక నగరంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

తీవ్ర ఆంక్షల నేపథ్యంలో.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు (శనివారం) నగరంలో బంద్‌ నిర్వహించనున్నట్టు వ్యాపార, వాణిజ్య వర్గాలు ప్రకటించాయి. కోవిడ్ -19 భద్రతా చర్యలకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని, అయితే లక్ష రూపాయల జరిమానా, 2 సంవత్సరాల జైలు శిక్ష విధించడం వంటి నిర్ణయాలు సరికావని, అది అమలు చేయడం అసాధ్యమని వాణిజ్య వర్గాలు పేర్కొన్నాయి. శనివారం నుంచి సాయంత్రం ఆరు గంటలకే దుకాణాలు, మార్కెట్లను బంద్ చేయనున్నట్టు సింగ్‌భుమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎస్‌సీసీఐ) అధ్యక్షుడు అశోక్ భలోటియా తెలిపారు.

Also Read: హైదరాబాద్‌కు మరో ఘనత.. దేశంలోనే మొదటి స్థానం..