చరిత్రలో తొలిసారి… మేడారం వద్ద పొంగుతున్న జంపన్న వాగు

Jampanna Vagu Overflowing at Medaram : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. ములుగు జిల్లాలోని జంప‌న్న వాగు పొంగి పొర్లుతుంది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానల‌కు జిల్లాలోని చాలా గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఇక వర్షపు నీరు మేడారం గ్రామాన్ని పూర్తిగా చుట్టేశాయి. ఓ గ్రామాన్ని వర్షపు నీరు పూర్తిగా ఇలా గ్రామాన్ని చుట్టేయడం చరిత్రలో తొలిసారి. ప్రస్తుతం జంపన్న వాగు నీరు మేడారం గద్దెల సమీపంలోని ఐటీడీఏ కార్యాలయానికి తాకింది. […]

చరిత్రలో తొలిసారి... మేడారం వద్ద పొంగుతున్న జంపన్న వాగు
Follow us

|

Updated on: Aug 15, 2020 | 9:51 PM

Jampanna Vagu Overflowing at Medaram : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. ములుగు జిల్లాలోని జంప‌న్న వాగు పొంగి పొర్లుతుంది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానల‌కు జిల్లాలోని చాలా గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఇక వర్షపు నీరు మేడారం గ్రామాన్ని పూర్తిగా చుట్టేశాయి. ఓ గ్రామాన్ని వర్షపు నీరు పూర్తిగా ఇలా గ్రామాన్ని చుట్టేయడం చరిత్రలో తొలిసారి. ప్రస్తుతం జంపన్న వాగు నీరు మేడారం గద్దెల సమీపంలోని ఐటీడీఏ కార్యాలయానికి తాకింది.

ఇప్పటికే పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. దీంతో పోలీసులు పస్రా నుంచి మేడారానికి రవాణా సౌకర్యాలను నిలిపివేశారు. ఊరట్టం వద్ద భారీగా జంపన్న వాగు భారీగా ప్రవహిస్తోంది. మేడారం గ్రామం బ్రిడ్జీపై నుంచి ప్రవహిస్తూ గ్రామంలోకి వరద నీరు చేరుతోంది. వరద ఉధృతితో మేడారం అమ్మవార్ల గద్దెలను జంపన్న వాగు నీరు తాకనుంది. వర్షపు నీరు ఇప్పటికే చిలుకల గుట్టను తాకి మేడారం గద్దెల వైపు భారీగా ప్రవహిస్తోంది.