Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 73 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 173763. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86422. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 82370. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4971. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • లాక్‌డౌన్‌పై స్పష్టతనిచ్చిన కేంద్ర ప్రభుత్వం. కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగింపు. మిగతా ప్రాంతాల్లో దశలవారిగా ఆంక్షల తొలగింపు. రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగింపు సమయం రాత్రి 9.00 నుంచి ఉదయం గం. 5.00 వరకు
  • నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంలో నిన్నటి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు. కెవియట్ దాఖలు చేసిన ఏఐసీసీ కార్యదర్శి మస్తాన్ వలీ.
  • కరోనా పేషంట్స్ కోసం రోబోట్ రూపకల్పన. కరోనా రోగులకు మెడిషన్, ఆహారాన్ని అందించడం కోసం ఔరంగాబాద్‌లో రోబోట్ రూపకల్పన. మహారాష్ట్ర లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి సాయి సురేష్ రూపొందించాడు.
  • దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన సికింద్రాబాద్ ప్రజలకు, ప్రధాని మోదీకి, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు. 200కు పైగా దేశాలు కరోనా బారిన పడ్డాయి. ప్రపంచంలో ఏదేశంతో పోల్చి చూసినా భారత్ మెరుగైన పరిస్థితిలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ అభినందిస్తున్నాయి. ఏ కొలమానంతో పోల్చి చూసినా భారత్ అత్యంత మెరుగ్గా పనిచేసింది. కిషన్ రెడ్డి, హోం సహాయ మంత్రి.
  • అవుటర్ టోల్ గేట్ల వద్ద క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ ప్రాధాన్యత. కరోనా నేపథ్యంలో క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ ప్రాధాన్యత అంటున్న హెచ్ ఎం డి ఏ. ఓ ఆర్ ఆర్ పై రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ యూజర్స్. నిత్యం ప్రయాణించే లక్షా 30 వేల వాహనాల్లో 60 వేలు ఫాస్టాగ్​ యూజర్స్​ . 2018 డిసెంబర్​ 11వ తేదీ నుంచి అమలులోనికి వచ్చిన ఫాస్టాగ్​ నిబంధనలు . ఫాస్టాగ్​ లేని వాహనదారులు నగదు రహిత లావాదేవీలు జరపాలంటున్న హెచ్​ఎండిఏ.
  • వందేభారత్ మిషన్ లో భాగంగా ఢిల్లీ నుండి మాస్కోకు వెళుతున్న ఎయిర్ ఇండియా (AI-1945) పైలెట్ కి కరోనా పాజిటివ్. కరోనా పాజిటివ్ రావడం తో ఫ్లైట్ వెనక్కి తిరిగి వస్తుందని అధికారులు వెల్లడి.

యుద్ధభూమిలో ఆతిథ్యం..

Jammu & Kashmir: Tourist Paradise in Jammu and Kashmir, యుద్ధభూమిలో ఆతిథ్యం..

కశ్మీర్‌కు వెళ్లేవారిలో టూరిస్టులే ఎక్కువ.. పర్యాటకుల నుంచి ఆదాయం వస్తుంది కాబట్టి వారికి ఉగ్రవాదులు ఎలాంటి హాని తలపెట్టరు.. కానీ నా చేతిలో మైక్, కెమెరామన్ చేతిలో కెమెరా పట్టుకుని మా ఐడెంటిటీని దాచుకుని తిరగలేం. అలా తిరిగినా ఉపయోగం ఏముంటుంది టీవీ మీడియాకు? మీడియా ప్రతినిధులుగా మమ్మల్ని చూడగానే స్థానిక కశ్మీరీల్లో ఎవరైనా ముందుగా అనే మాట “ఇండియన్ మీడియా.. XXXXX” అనే పదంతో మొదలుపెట్టి తిట్ల దండకమే. నాకు కశ్మీర్ పర్యటన మొదటిసారేమీ కాదు. అప్పటికే శ్రీనగర్ ఎన్.ఐ.టీలో జరిగిన గొడవ, అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై కాల్పులు, ఉరి – ఉగ్ర ఘాతుకం సహా పలు సందర్భాల్లో అక్కడ అన్ని మూలలూ తిరిగినవాడినే. అయినా సరే.. వెళ్లిన ప్రతిసారీ.. నేను ఓ పరాయి దేశంలో.. అందునా శతృదేశం పాకిస్తాన్‌లో ఉన్నానేమో అనిపించేది. ఎందుకంటే కనిపించిన ప్రతి పది మందిలో ఏడేనిమిది మంది మమ్మల్ని ఇండియన్ మీడియా, ఇండియన్ ఆర్మీ, బ్లడీ ఇండియన్స్ అంటూ వేరు చేసి మాట్లాడడమే. వాళ్ల మాటలు ఆగ్రహం తెప్పించినా సరే.. అత్యంత ఓర్పు, సహనంతో ఉండాలి. తప్పదు. అనువుగాని చోట అధికులం అంటే.. ప్రాణాలకే గ్యారంటీ లేకుండా పోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మన విధి నిర్వహణ పూర్తిచేయాలంటే లౌక్యం కూడా చాలా అవసరం. సుదీర్ఘకాలం క్రైమ్ రిపోర్టింగ్ కూడా చేసినందున, నాకు మాబ్ హిస్టీరియా గురించి కూడా బాగా అవగాహన ఉంది. ఒక గుంపులో ఏ ఒక్కరు అదుపుతప్పి దాడికి దిగినా, మిగతావాళ్లు అడ్డుకోరు సరికదా, తలా ఓ చేయి వేసి చావబాదుతారు. ఈ అనుభవాలతోనే అక్కడ హిందీ, ఇంగ్లిష్ న్యూస్ ఛానెళ్లకు చెందిన రిపోర్టర్లు తమ మైక్ మీద లోగో లేకుండా పట్టుకుని తిరుగుతూ ఉంటారు. పైగా సెన్సిటివ్ ప్రాంతాల్లోకి రాకుండా భద్రతా బలగాల మధ్య తిరుగుతూ రిపోర్టింగ్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడి పరిస్థితిని చూపాలంటే అది మాత్రమే సరిపోదు.

అందుకే.. శ్రీనగర్ సిటీలో సెన్సిటివ్ ప్రాంతాలకు వెళ్లినప్పడు, అక్కడివారితో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు నా పరిచయంతో పాటుగా నేను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పేవాడిని. కశ్మీర్‌లో దక్షిణ భారతీయులపై, ముఖ్యంగా హైదరాబాదీలపై చాలా మందికి సాఫ్ట్ కార్నర్ ఉంది. అక్కడికి వచ్చే పర్యాటకుల్లోనూ దక్షిణాదివారు సౌమ్యంగా, హుందాగా ఉంటారని, ఎటొచ్చీ ఉత్తరాది రాష్ట్రాలవారికే ఆగ్రహావేశాలు ఎక్కువని కశ్మీరీల భావన. అంతేకాదు, ఉరి – పుల్వామా దాడుల నేపథ్యంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరిగాయి. వాటిలో అత్యధికంగా ఉత్తర భారతదేశంలోనే జరిగాయి. ఇది కూడా వారి మనసుపై ఒక ముద్ర వేశాయి. దానికి తోడు కశ్మీరీలు విపరీతంగా ద్వేషించే బీజేపీ – ప్రధాని నరేంద్ర మోదీలకు దక్షిణాది రాష్ట్రాల్లో ఆదరణ లేకపోవడం వల్ల కూడా కాస్తో-కూస్తో సౌతిండియన్స్ పై స్నేహభావం ఏర్పడింది. నా పని నిర్విఘ్నంగా, సురక్షితంగా చేసుకోడానికి వీలుగా ఈ ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ స్టేట్ విలీనం వరకు చరిత్రను గుర్తుచేస్తూ లౌక్యం ప్రదర్శించేవాడిని.

ఫిబ్రవరి 17న పుల్వామా ఉగ్రదాడి ప్రాంతంతో పాటు నగరంలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో తిరిగి గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేశాం. ఈ క్రమంలో ఆకలిదప్పులు మర్చిపోయాం. కానీ సాయంత్రమయ్యేసరికి మా టీమ్‌లో నీరసం ఆవహించింది. ఎక్కడైనా ఆగి తిందాం అంటే.. కర్ఫ్యూ కారణంగా సిటీ మొత్తం లాక్ డౌన్. తినడానికి ఎక్కడా తిండి దొరకని పరిస్థితి. పోనీ చేసిన కవర్ ఫుటేజి పంపిద్దాం అంటే మొబైల్ ఇంటర్నెట్ షట్ డౌన్. ఇంత కష్టపడి చేసిన కవరేజి టెలికాస్ట్ కాకపోతే ఆ బాధ ఒక జర్నలిస్టుకు వర్ణనాతీతం. కానీ ఏదో ఒక ప్రత్యామ్నాయం చూడాలి. పాత మిత్రుడు మెహరాజ్ అహ్మద్‌ను అడిగితే, సిటీలో బ్రాడ్‌బ్యాండ్ కూడా సరిగా పనిచేయడం లేదని, చాలా స్లోగా ఉందని చెప్పాడు.

పుల్వామాలో కారులో వచ్చి ఆత్మాహుతి దాడి చేసిన చోట రోడ్డు కొంత పాడవడంతో రిపేర్ వర్క్ చేయడానికి వచ్చిన కొందరు తెలుగు ఇంజనీర్లు టీవీ9 లోగో చూసి గుర్తుపట్టి మా బ్యాకప్ టీమ్‌తో అంతకంటే ముందు రోజు మాట్లాడారు. ఆ విషయం నాకు గుర్తుండడంతో వాళ్లను పట్టుకునే సహాయం దొరకవచ్చు అనుకుంటూ సిటీ వదిలి హైవే మీదకొచ్చాం. శ్రీనగర్ – జమ్ము నేషనల్ హైవే నిర్మాణంతో పాటు మెయింటనెన్స్ కాంట్రాక్ట్ పనులు రాంకీ గ్రూపు నిర్వహిస్తోందని హైవే మీద ఉన్న బోర్డుల ద్వారా అర్థమైంది. వెంటనే వాళ్ల లోకల్ క్యాంప్ ఎక్కడుందో వాకబు చేసి పుల్వామాకు సమీపంలో ఉన్న క్యాంప్ దగ్గరకు చేరుకున్నాం. మా పరిస్థితి వివరించి, మీ దగ్గర బ్రాడ్‌బ్యాండ్ ఉంటే ఇంటర్నెట్ వాడుకుంటాం అని చెప్పాం. అక్కడున్న యూనిట్ హెచ్ఆర్ హెడ్ రాజు గోరంట్ల, మరో టెక్నికల్ ఇన్‌ఛార్జి కిశోర్ సహా అక్కడున్నవారంతా ఎంతో సంతోషంగా, సాదరంగా స్వాగతించారు. ఇంటర్నెట్ ల్యాన్ వైర్ మా 4జీ కిట్‌కు కనెక్ట్ చేసి ఐపీ అడ్రస్ రూట్ చేశా. (వృత్తి జర్నలిజమే అయినా నేను చదువుకున్నది కంప్యూటర్ సైన్స్, ఐన్ఫర్మేషన్ టెక్నాలజీ కావడంతో ఆ పరిజ్ఞానం నాకుంది). అయితే ఫీడ్ పంపేంత బ్యాండ్ విడ్త్ రావడం లేదు. ఇక ఇలా లాభం లేదని, ఫుటేజి మొత్తం నా ల్యాప్‌టాప్‌లో డంప్ చేశాను. వాటిని వేర్వేరు ఫైల్స్ రూపంలో ఎడిట్ చేసి, FTP ద్వారా మొత్తం ఫీడ్ పంపించాను.

అప్పటికే మా వాలకం చూసి “ఏమైనా తిన్నారా?” అంటూ వాళ్లు మమ్మల్ని అడగడం, మేం మొహమాటంతోనే లేదు అని చెప్పడం జరిగిపోయాయి. వెంటనే వాళ్ల మెస్‌లో మా అందరికీ భోజనాలు సిద్ధం చేయించారు. మూడు రోజుల తర్వాత తెలుగింటి రుచితో కూడిన భోజనం చేశాం. అప్పటికే చీకటి కమ్ముకుంది.. తదుపరి కవరేజి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇక మా హోటల్ (గెస్ట్ హౌజ్)కి వెళ్లిపోయాం.

Related Tags