కాశ్మీర్లో పంచాయతీ ఉపఎన్నికలకు బ్రేక్.. మూడు వారాలు వాయిదా

జమ్మూ కాశ్మీర్.. పంచాయతీ ఉప ఎన్నికల వాయిదా.. భద్రతా కారణాలతో మూడు వారాలపాటు వాయిదా వేసినట్టు చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ శైలేంద్ర కుమార్ తెలిపారు.

కాశ్మీర్లో పంచాయతీ ఉపఎన్నికలకు బ్రేక్.. మూడు వారాలు వాయిదా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 19, 2020 | 12:36 PM

జమ్మూకాశ్మీర్లో పంచాయతీ ఉపఎన్నికలకు బ్రేక్ పడింది.భద్రతా కారణాల దృష్ట్యా.. ఈ ఎన్నికలను మూడు వారాలపాటు వాయిదా వేశారు. మొత్తం 12,500 పంచాయతీలకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 5 నుంచి 20 వ తేదీ వరకు వీటిని నిర్వహించదలిచామని, అయితే హోం శాఖ నుంచి అందిన ఆదేశాలతో వాయిదా వేశామని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శైలేంద్ర కుమార్ తెలిపారు. మొదటి, రెండో దశ ఎన్నికలకు అప్పుడే రెండు నోటిఫికేషన్లు జారీ చేసినట్టు ఆయన చెప్పారు. 2018 లో ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరిగినా.. వాటిని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ బహిష్కరించాయి. ముగ్గురు మాజీ సీఎంలతో సహా.. పలువురు రాజకీయ నేతలు గత ఏడాది నుంచి నిర్బంధంలో ఉన్న నేపథ్యంలో ఈ పంచాయతీ ఉపఎన్నికలను  ఎలా నిర్వహిస్తారని వివిధ పార్టీల నాయకులు శైలేంద్ర కుమార్ ను ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్టీ సహా మరికొందరికి  ప్రభుత్వం గృహ నిర్బంధం విధించిన సంగతి తెలిసిందే. గత ఆగస్టు 5 న జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేసిన అనంతరం ఈ కాశ్మీర్ నేతలకు గృహనిర్బంధం విధించారు. అయితే పంచాయతీ ఉపఎన్నికలను నిర్వహించిన పక్షంలో వీరంతా ఈ ప్రక్రియలో ఎలా పాల్గొనగలుగుతారని ఆయా పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు