Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

దేశమంతా హై అలర్ట్..!

Delhi: Security Forces On High Alert Ahead Of Independence Day, దేశమంతా హై అలర్ట్..!

స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు స్కెచ్‌ వేసినట్టు నిఘా వర్గాల సమాచారంతో.. దేశమంతా హై అలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వెళ్లే రైళ్లలో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్టు భారత నిఘా వర్గాల దగ్గర ఖచ్చితమైన సమాచారముంది. దీంతో ఢిల్లీతో సహా ప్రధాన నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఢిల్లీలో ఉగ్రవాదుల ఫోటోలను గోడలపై అతికించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఎర్రకోటతో సహా పలు ప్రాంతాల్లో అడుగడుగునా భద్రతా బలగాలను మోహరించారు. ఇక జమ్ముకశ్మీర్‌లో కూడా హై అలర్ట్‌ కొనసాగుతోంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హైఅలర్ట్‌ కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌ నుంచి దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు భారీ విధ్వంసం సృష్టించే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో బస్టాండ్‌లు , రైల్వేస్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గౌహతి రైల్వేస్టేషన్‌లో భారీగా తనిఖీలు చేపట్టారు. బాంబ్‌ స్క్వాడ్‌ , డాగ్‌ స్క్వాడ్‌లతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానితులతో అదుపు లోకి తీసుకొని ప్రశ్నించారు.