ఆయన జయంతి రోజున యూటీలుగా కశ్మీర్, లదాఖ్..

Jammu And Kashmir, Ladakh To Become Union Territories On Sardar Patel Birth Anniversary

ఆర్టికల్ 370 రద్దుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దేశ తొలి హోంమంత్రి పటేల్ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31 రోజున నూతన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్ము కశ్మీర్ లదాఖ్ ఉనికిలోకి రానున్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జమ్ముకశ్మీర్ అసెంబ్లీతో కూడిన యూటీగా.. లదాఖ్ అసెంబ్లీలేని యూటీగా మారతాయి. అయితే ఈ రెండు యూటీల్లోనూ శాంతిభద్రతలు కేంద్రం పరిధిలోకి వెళతాయి. కొత్తగా ఏర్పడే జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో 107 స్థానాలు ఉంటాయి. నూతన నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 114కు పెంచుతారు. కాగా, ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితులు చక్కబడుతున్నాయి. జనాలు రోడ్ల పైకి వస్తున్నారు. సోమవారం బక్రీద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. పలు మసీదుల్లో కూడా ప్రార్థనలు చేసేందుకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు. అల్లర్లు జరిగే ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *