కశ్మీర్‌పై స్లోగన్ ఛేంజ్ చేసిన చైనా? రీజన్ ఏంటంటే?

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. కానీ ఈ టైంలో పాక్‌కు..చైనా బాంబ్ లాంటి న్యూస్ చెప్పింది.   చైనా విదేశాంగ శాఖ కశ్మీర్‌పై చేసిన ప్రకటన అంతకుముందు కంటే పూర్తి భిన్నంగా ఉంది. “యూఎన్ చార్టర్, దాని ప్రతిపాదనల ప్రకారం కశ్మీర్ సమస్యకు పరిష్కారం వెతకాలని” చైనా ఇటీవల చెప్పింది. కానీ, ఇప్పుడు మాత్రం “భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చల ద్వారా కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి” అంటోంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత […]

కశ్మీర్‌పై స్లోగన్ ఛేంజ్ చేసిన చైనా? రీజన్ ఏంటంటే?
Follow us

|

Updated on: Oct 10, 2019 | 6:38 AM

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. కానీ ఈ టైంలో పాక్‌కు..చైనా బాంబ్ లాంటి న్యూస్ చెప్పింది.   చైనా విదేశాంగ శాఖ కశ్మీర్‌పై చేసిన ప్రకటన అంతకుముందు కంటే పూర్తి భిన్నంగా ఉంది. “యూఎన్ చార్టర్, దాని ప్రతిపాదనల ప్రకారం కశ్మీర్ సమస్యకు పరిష్కారం వెతకాలని” చైనా ఇటీవల చెప్పింది. కానీ, ఇప్పుడు మాత్రం “భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చల ద్వారా కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి” అంటోంది.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత పర్యటన ముందు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చైనాలో పర్యటించడంపై చైనా విదేశాంగ శాఖను అక్కడి మీడియా నుంచి జిన్‌పింగ్‌కు ప్రశ్నోత్తరాలు వెల్లువెత్తాయి. “ఈ రెండు పర్యటనలకూ ఏదైనా సంబంధం ఉందా? పాక్ ప్రధాని ఈ పర్యటనలో కశ్మీర్ అంశం కూడా లేవనెత్తుతారని వార్తలు వెలువడుతున్నాయి” అంటూ ప్రశ్నించింది.

సమాధానం ఇచ్చిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గ్యాంగ్ షువాంగ్, “కశ్మీర్ అంశంపై చైనా వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. మా వైఖరి పూర్తిగా స్పష్టంగా ఉంది. భారత్-పాకిస్తాన్‌కు మేం చెప్పేది ఒక్కటే. కశ్మీర్‌తో పాటు మిగతా వివాదాలను కూడా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. దానివల్ల రెండు దేశాల మధ్య పరస్పరం నమ్మకం పెరుగుతుంది. ఆ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. దానివల్ల భారత్, పాక్ సమస్యలు పరిష్కారం అవుతాయి” అన్నారు.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అక్టోబర్ 11, 12 తేదీల్లో రెండు రోజుల పర్యటన కోసం భారత్ వస్తున్నారు. కాగా గతంలో, ఆర్టికల్ 370ని తొలగించిన భారత్ జమ్ము-కశ్మీర్ యధాతథ స్థితిని మార్చేస్తోందని  చైనా నీతి వాఖ్యాలు వెలగబోసింది . పాకిస్తాన్ ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వరకూ తీసుకెళ్లింది. అక్కడ దానికి చైనా మద్దతు కూడా లభించింది. అంతేకాదు, కొన్ని రోజుల కిందట పాకిస్తాన్‌లోని చైనా రాయబారి యావో జింగ్‌ “కశ్మీర్ అంశంలో చైనా పాకిస్తాన్‌కు అండగా ఉంటుందని” అన్నారు.  కానీ ఇప్పుడు మాత్రం కశ్మీర్ అంశాన్ని భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ శాఖ చెబుతోంది. పాకిస్తాన్‌ను చైనాకు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా గెంగ్ షువాంగ్ చెప్పారు. రెండు దేశాల నేతల మధ్య సన్నిహిత చర్చల సంప్రదాయం ఉందన్నారు.

కాగా త్వరలో భారత్ పర్యటను రానున్న చైనా అధ్యక్షుడు ఇక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకూాడదనే కారణంతోనే ఇంత వైరుద్యమైన ప్రకటన చేశారని..కశ్మీర్ విషయంలో చైనా స్టాండ్‌ ఏంటో అందరికి తెలిసిందే అని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!