ముంబై దాడుల సూత్ర ధారి.. హఫీజ్ సయీద్ అరెస్ట్..

ముంబై దాడుల్లో కీలక సూత్రధారి.. జమాతుద్ద-ఉల్-దవా  చీఫ్ హఫీజ్ సయీద్‌ను పాక్ యాంటీ టెర్రర్ సెల్ అరెస్ట్ చేసింది. అనంతరం జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. హాఫీజ్ సయీద్ అరెస్ట్‌ను పాక్ మీడియా వర్గాలు కూడా ధృవీకరించాయి. ఉగ్రవాద సంస్థలైన లష్కర్ – ఇ – తోయిబా, జమాత్ – ఉద్ – దవా సంస్థకి హఫీజ్ సయీద్ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. కరుడు గట్టిన ఈ ఉగ్రవాదిపై 23 కేసులు ఉన్నాయి. ప్రపంచంలోని పలు చోట్ల జరిగిన బాంబు […]

ముంబై దాడుల సూత్ర ధారి.. హఫీజ్ సయీద్ అరెస్ట్..
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2019 | 1:15 PM

ముంబై దాడుల్లో కీలక సూత్రధారి.. జమాతుద్ద-ఉల్-దవా  చీఫ్ హఫీజ్ సయీద్‌ను పాక్ యాంటీ టెర్రర్ సెల్ అరెస్ట్ చేసింది. అనంతరం జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. హాఫీజ్ సయీద్ అరెస్ట్‌ను పాక్ మీడియా వర్గాలు కూడా ధృవీకరించాయి.

ఉగ్రవాద సంస్థలైన లష్కర్ – ఇ – తోయిబా, జమాత్ – ఉద్ – దవా సంస్థకి హఫీజ్ సయీద్ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. కరుడు గట్టిన ఈ ఉగ్రవాదిపై 23 కేసులు ఉన్నాయి. ప్రపంచంలోని పలు చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో హాఫీజ్ సయీద్ కీలక పాత్ర పోషించాడు. హఫీజ్‌ కోసం భారత్‌తో పాటు అమెరికా కూడా వెతుకుతోంది. అతని ఆచూకీ గురించి సమాచారం అందించిన వారికి 50 కోట్ల రూపాయలు బహుమానాన్ని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

ఇదిలావుండగా, హఫీజ్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా, పాకిస్థాన్ మీద ఒత్తిడి తెస్తోంది. అతను వివసించే చోటు, అలాగే అతనికి సంబంధించిన బలమైన ఆధారాలను తమకు ఇవ్వవలసిందిగా అమెరికా అడుగుతోంది. ఈ నేపథ్యంలో పాక్ యాంటీ టెర్రర్ సెల్ అదుపులోకి తీసుకుని.. జ్యుడీషియల్ కస్టడీకి అనంతరం జైలుకు తరలించారు.