క్యూబాలో భూకంపం..సునామీ హెచ్చరికలు

కరేబియన్‌ దీవులను భూకంపం వణికించింది. జమైకా, క్యూబా, మధ్య వచ్చిన భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.7గా నమోదైంది. మెక్సికోలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కదిలిపోవడంతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లకు పగుళ్లు ఏర్పాడ్డాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. మాంటెగోబే-జమైకాకు వాయవ్యంగా 139 కిలోమీటర్ల దూరంలో..ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. […]

క్యూబాలో భూకంపం..సునామీ హెచ్చరికలు
Follow us

|

Updated on: Jan 29, 2020 | 8:43 AM

కరేబియన్‌ దీవులను భూకంపం వణికించింది. జమైకా, క్యూబా, మధ్య వచ్చిన భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.7గా నమోదైంది. మెక్సికోలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కదిలిపోవడంతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లకు పగుళ్లు ఏర్పాడ్డాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

మాంటెగోబే-జమైకాకు వాయవ్యంగా 139 కిలోమీటర్ల దూరంలో..ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. భారీ భూ ప్రకంపనలతో క్యూబా, జమైకా, కేమన్‌ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.