చిత్తూరు జిల్లా అనుపల్లిలో సంక్రాంతి సందడి, వందలాది ఎద్దులతో జల్లికట్టు పోటీలు షురూ, వేలల్లో తరలివస్తోన్న జనం

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం అనుప్పలిలో సంక్రాంతి పర్వదినాలు పురస్కరించుకుని సాంప్రదాయబద్ధంగా జరిగే జల్లికట్టు పోటీలు..

  • Venkata Narayana
  • Publish Date - 12:46 pm, Wed, 13 January 21

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం అనుప్పలిలో సంక్రాంతి పర్వదినాలు పురస్కరించుకుని సాంప్రదాయబద్ధంగా జరిగే జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. జల్లికట్టు పోటీలు చూసేందుకు జనం వేలాదిగా చేరుకుంటున్నారు. జల్లికట్టులో వందలాది ఎద్దులను తీసుకొచ్చి పందేలకు నిలుపుతుండగా, ఎద్దులను పట్టుకునేందుకు యువత సాహసాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల నుంచి అనుపల్లి ప్రజలు తరలివస్తున్నారు. కాగా, పోటీల్లో పాల్గొనే ఎద్దులకి పవన్ కల్యాణ్, బాలకృష్ణ, మహేశ్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను తగిలిస్తున్నారు నిర్వాహకులు.