‘ఆర్ఆర్ఆర్‌’ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ..!

లాక్‌డౌన్‌తో సినిమాల షూటింగ్‌లకు బ్రేక్‌ పడింది. అంతేకాదు మార్చి, ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన చాలా మూవీలు కూడా రిలీజ్ డేట్లను పోస్ట్‌పోన్ చేసుకున్నాయి.

'ఆర్ఆర్ఆర్‌' రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ..!
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2020 | 12:59 PM

లాక్‌డౌన్‌తో సినిమాల షూటింగ్‌లకు బ్రేక్‌ పడింది. అంతేకాదు మార్చి, ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన చాలా మూవీలు కూడా రిలీజ్ డేట్లను పోస్ట్‌పోన్ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ విడుదల తేదీపై కూడా పలు వార్తలు వినిపించాయి. ఈ మూవీ విడుదలను వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని టాక్‌ నడిచింది. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై రాజమౌళి స్పందించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ ఎప్పుడు రిలీజ్‌ను నేను చెప్పలేను. లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఎత్తివేసి.. మూవీ షూటింగ్‌లు ప్రారంభమైనప్పుడే ఆర్ఆర్ఆర్ రిలీజ్‌పై ఓ క్లారిటీ ఇవ్వగలం. అనుకున్న సమయానికే మూవీ షూటింగ్‌ను పూర్తి చేయాలని మేము చాలా కష్టపడ్డాం. ఆర్ఆర్ఆర్‌ పోస్ట్ ప్రొడక్షన్‌ కోసం చాలా సమయం అవసరం అవుతుంది. ఇప్పుడు లాక్‌డౌన్‌ వలన అన్ని పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్‌ పనులు మాత్రమే జరుగుతున్నాయి. వారానికి మూడు సార్లు స్కైప్‌లో మేము మాట్లాడుకుంటున్నాం అని రాజమౌళి చెప్పారు. అయితే ఆయన మాటలను బట్టి చూస్తుంటే ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా ఖాయం అని అర్థమవుతోందని, దీన్ని ముందుగానే ఊహించామని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.  మరి ఈ మూవీ ఎప్పటివరకు వాయిదా పడనుంది అని తెలుసుకోవాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.

కాగా ఆర్ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. ఇందులో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా.. అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా కనిపించనున్నారు. అజయ్‌ దేవగన్‌, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Read This Story Also: ‘సీసీసీ’ కోసం దానికైనా సిద్ధమేనన్న మెగాస్టార్..!