ట్రంప్ భారత్ విజిట్.. ‘పగ’ తీర్చుకుంటామన్న జైషే మహమ్మద్ !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల చివరివారంలో భారత్ రానున్నారు. ఆయన పర్యటనకు అప్పుడే ఇండియా, అమెరికా విశేష ప్రాధాన్యమిస్తున్నాయి. ఢిల్లీతో బాటు అహ్మదాబాద్ కూడా సందర్శించి అక్కడి అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ఆయన ప్రధాని మోదీతో కలిసి ప్రసంగించనున్నారు. ట్రంప్ కు స్వాగతం చెప్పేందుకు లక్షలాది ప్రజలను సంసిద్దులను చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఓ ఎత్తయితే.. ఉగ్రవాద సంస్థ ‘జైషే మహమ్మద్’ “రివెంజ్’ (పగ) పేరిట ఓ వీడియోను  రిలీజ్ చేసింది. […]

ట్రంప్ భారత్ విజిట్.. 'పగ' తీర్చుకుంటామన్న జైషే మహమ్మద్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 12:36 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల చివరివారంలో భారత్ రానున్నారు. ఆయన పర్యటనకు అప్పుడే ఇండియా, అమెరికా విశేష ప్రాధాన్యమిస్తున్నాయి. ఢిల్లీతో బాటు అహ్మదాబాద్ కూడా సందర్శించి అక్కడి అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ఆయన ప్రధాని మోదీతో కలిసి ప్రసంగించనున్నారు. ట్రంప్ కు స్వాగతం చెప్పేందుకు లక్షలాది ప్రజలను సంసిద్దులను చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఓ ఎత్తయితే.. ఉగ్రవాద సంస్థ ‘జైషే మహమ్మద్’ “రివెంజ్’ (పగ) పేరిట ఓ వీడియోను  రిలీజ్ చేసింది. ఇందులో ఆ సంస్థ నాయకుడొకరు.. భారత ప్రభుత్వాన్ని హెచ్చరించడమే గాక.. .. అదే సమయంలో ట్రంప్ విజిట్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ‘కిల్లర్స్’ (ట్రంప్) ను క్షమించే ప్రసక్తి లేదని, మీరు ముస్లిములను వేధించినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అన్నాడు. శాంతి, సామరస్యాలపై మీరు చేసిన కల్లబొల్లి మాటలను చాలానే విన్నామని, ఇక ఇవన్నీ బంద్ అయినట్టేనని పేర్కొన్నాడు. పరిస్థితి జటిలం కావచ్ఛు.. ఆ సమయం ఆసన్నమైంది అని కూడా వార్నింగ్ ఇచ్చాడు.

370 అధికరణం రద్దు తరువాత.. కాశ్మీరీలు చాలా ఆగ్రహంతో ఉన్నారని, ఉగ్రవాద దాడులు చేస్తున్నారని ట్రంప్ టూర్ సందర్భంగా పాక్ పరోక్ష  వైఖరిని చూపడానికే ఈ వీడియోను ఈ ఉగ్రవాద సంస్థ రిలీజ్ చేసినట్టు  తెలుస్తోంది.  ఈ నెల మొదటివారంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో టెర్రరిస్టు బృందాలు సమావేశమయ్యాయని, ఐఎస్ఐ, పాక్ ఆర్మీకి చెందిన అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారని తెలిపే ఓ వీడియోకు సంబంధించిన ఇన్-ఫుట్ భద్రతా దళాలకు అందింది. అలాగే పాక్ టెర్రరిస్టుల బదులు కాశ్మీర్ లోని ఉగ్రవాదులకు మరిన్ని ‘బాధ్యతలు’ ఇచ్ఛే విషయమై ఈ మీటింగ్ లో చర్చించినట్టు చెబుతున్నారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థల నుంచి అన్ని ఉగ్రవాద చర్యల తాలూకు బాధ్యతలను హిజ్ బుల్-ముజాహిదీన్ స్వీకరించాలని ఆ సమావేశంలో ఓ ఆర్డర్ కూడా జారీ అయినట్టు తెలుస్తోంది. కాశ్మీరీలలో భయాందోళనలను రేకెత్తించేందుకు, పట్టణ ప్రాంతాల్లో సాధారణ ప్రజలపైన, భద్రతా దళాలపైన దాడులు చేసే యోచనలో కూడా ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం. అలాగే ఆత్మాహుతి దళాలను సైతం రెడీగా ఉంచినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది.