బుద్ధి మారని పాక్.. మసూద్ అజహర్‌ విడుదల

Jaish chief Masood Azhar secretly released from Pak jail: Intel, బుద్ధి మారని పాక్.. మసూద్ అజహర్‌ విడుదల

పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చూపించుకుంది. ఉగ్రవాదాన్ని ఏరివేస్తున్నామంటున్న ఇమ్రాన్ వ్యాఖ్యలు కేవలం మాటలకు మాత్రమేనని తేటతెల్లమైంది. కరుడుగట్టిన ఉగ్రనేతః.. జైషే మహమ్మద్‌ చీఫ్‌ను విడుదల చేసింది. ఇటీవల కొద్ది రోజుల క్రితం మసూద్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటించిన పాకిస్థాన్‌.. ఆ వెంటనే యూటర్న్ తీసుకుని.. తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ప్రపంచ దేశాల ముందు టెర్రరిజాన్ని అంతం చేస్తున్నట్లు నటిస్తోంది. కానీ ఉగ్ర సంస్థల అధినేతల పట్ల మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతోంది. జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ను విడుదల చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి అప్రమత్తంగా ఉండాలని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్‌ సమీపంలో ఇండియా-పాకిస్థాన్‌ సరిహద్దు వద్ద పాక్‌ పెద్ద కుట్రకు పావులు కదుపుతోందని ఐబీ వర్గాలు వెల్లడించాయి.

భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరోకి చెందిన అధికారులు తెలిపిన ప్రకారం.. రాజస్థాన్‌-కశ్మీర్‌ సెక్టార్లలో అలజడి సృష్టించేందుకు పాక్ కుట్రలు పన్నుతోందని తెలిపారు. జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో పాక్ భారత్‌పై ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ.. కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే పాక్ కుట్రలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. తాజాగా మసూద్ అజహార్‌ని విడుదల చేశారన్న వార్తల నేపథ్యంలో.. రాజస్థాన్‌ సరిహద్దుల్లో భారీ స్థాయిలో పాక్ ఆర్మీని మొహరించినట్లు తెలుస్తోంది. దీంతో భారత ఆర్మీ కూడా అలర్ట్ అయ్యింది.

కాగా ఇటీవల పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. భారత్‌లో మరోసారి అలజడి సృష్టించేందుకు పాక్ కుట్రలు పన్నుతోందని అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే జైషే మహమ్మద్‌ చీఫ్ మసూద్‌ అజహర్‌ను రహస్యంగా విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థలకు భారత్‌లో దాడులకు ప్లాన్‌లు వేయడానికే మసూద్‌ను వదిలిపెట్టినట్లు ఐబీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *