సీఎల్పీ విలీనంపై జైపాల్‌రెడ్డి ఫైర్!

ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లా అమ్ముడుపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ నీచరాజకీయాలకు పరాకాష్టగా మారాయని ధ్వజమెత్తారు. స్పీకర్… సీఎం కేసీఆర్‌కు చెంచాలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ను చీల్చడానికి స్పీకర్ ఎవరు? అని ప్రశ్నించారు. ఎల్పీని విలీనం చేసే అధికారం స్పీకర్‌కు లేదని హితవు పలికారు. పార్టీని విలీనం చేసే అధికారం ఈసీకి మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. విలీనంపై హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.  

  • Tv9 Telugu
  • Publish Date - 9:24 pm, Sat, 8 June 19