Jagananna Amma Vodi : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్… జనవరి 11న ‘జగనన్న అమ్మఒడి’ రెండో విడత నగదు పంపిణీ..

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ పిల్లలను బడికి పంపించే తల్లులకు గుడ్ న్యూస్ చెప్పింది.  జనవరి 11న 'జగనన్న అమ్మఒడి' రెండో విడత నగదును ఖాతాల్లో జమ చేయనుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు..

Jagananna Amma Vodi : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... జనవరి 11న 'జగనన్న అమ్మఒడి' రెండో విడత నగదు పంపిణీ..
Follow us

|

Updated on: Jan 04, 2021 | 10:38 PM

Amma Vodi : ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ పిల్లలను బడికి పంపించే తల్లులకు గుడ్ న్యూస్ చెప్పింది.  జనవరి 11న ‘జగనన్న అమ్మఒడి’ రెండో విడత నగదును ఖాతాల్లో జమ చేయనుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు.  నెల్లూరులో రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
ఈ సారి గతంలో కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకి ఇస్తున్నామని తెలిపారు. అర్హులైనవారందరికీ కచ్చితంగా ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. కార్పొరేట్ స్కూళ్ల మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నెల్లూరు ఆర్‌ఐవోను బెదిరించిన నారాయణ కాలేజి డైరెక్టర్‌పై కేసు నమోదుకు ఆదేశించామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.
అర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్కరికీ అర్హత ఉంటే అమ్మఒడి పథకం అందజేస్తామని మంత్రి హామి ఇచ్చారు. గతేడాది 43.54 లక్షల మంది లబ్ధిదారులకు ఈ స్కీమ్ కింద రూ.6,336 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇక టీచర్ల బదిలీ ప్రక్రియపై కూడా మంత్రి స్పందించారు. ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందన్నారు.

ఇవి కూడా చదవండి..

గవర్నర్‌తో 40 నిమిషాలపాటు ముఖ్యమంత్రి జగన్ సమావేశం.. ఆ అంశంపైన ప్రధాన చర్చ Sankranti Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..జనవరి  11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు