జగన్ ట్యూషన్.. పాస్ అయిందెవరు? ఫెయిల్ అయిందెవరు?

Jagan tution... who passed? who failed..?

ఏపీ సీఎంగా వై.ఎస్.జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే పాలనపై ఫుల్ ఫోకస్ పెట్టారు. తనదైన శైలిలో పాలనపై పట్టు బిగిస్తున్నారు. దేశమంతా చర్చ జరిగే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ సీఎం ఒక్కరే చురుగ్గా ఉంటే సరిపోదు. అందుకే మంత్రులు, ఎంపీల పనితీరుపై జగన్ ఫోకస్ పెట్టారు.

మంత్రులు,ఎంపీలు ఎలా పని చేస్తున్నారని ఆరా తీస్తున్నారు. అంతేకాదు..పక్కాగా రిపోర్ట్ తెప్పించుకుని మార్కులు కూడా వేశారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే మెజార్టీ మంత్రులు పాస్ మార్కుల దగ్గరే ఆగిపోయారని సమాచారం. దీంతో వాళ్లకి సీఎం స్పెషల్ క్లాస్ తీసుకున్నారని, పనితీరు మార్చుకోవాలని తేల్చి చెప్పారని వైసీపీలో డిస్కషన్ నడుస్తోంది. అలాగే ఎంపీలకు కూడా జగన్ మార్కులు వేశారు. కేవలం 8 మంది ఎంపీలకే మంచి మార్కులు పడ్డాయని, మిగిలిన వారిలో కొందరు పాస్ మార్కుల దగ్గరే ఆగిపోయారు. అలాగే మరికొందరు ఫెయిల్ అయ్యారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *