రెండు, మూడు రోజుల్లో ‘సైరా’ సినిమాకి జగన్..!

తాజాగా.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి కలయిక.. మొత్తానికి ముగిసింది. సోమవారం మధ్యాహ్నం.. సతీ సమేతంగా.. మెగాస్టార్.. సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్.. చిరును సాదరంగా ఆహ్వానించారు. వీరిద్దరి భేటీ.. తాజాగా.. అటు రాజకీయాల్లోనూ.. ఇటు తెలుగు సినీ పరిశ్రమలోనూ.. తీవ్ర చర్చలు నడిచాయి. వీరి భేటీపై ఎన్నో ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి. కాగా.. వీరు.. సైరా సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారని.. అది కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన కథ […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:57 am, Tue, 15 October 19

తాజాగా.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి కలయిక.. మొత్తానికి ముగిసింది. సోమవారం మధ్యాహ్నం.. సతీ సమేతంగా.. మెగాస్టార్.. సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్.. చిరును సాదరంగా ఆహ్వానించారు. వీరిద్దరి భేటీ.. తాజాగా.. అటు రాజకీయాల్లోనూ.. ఇటు తెలుగు సినీ పరిశ్రమలోనూ.. తీవ్ర చర్చలు నడిచాయి. వీరి భేటీపై ఎన్నో ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి.

కాగా.. వీరు.. సైరా సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారని.. అది కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన కథ కాబట్టి.. పలు అంశాల గురించి చర్చించుకున్నారట. అంతేకాకుండా.. మెగాస్టార్ స్టిల్స్.. సినిమాలో బాగున్నాయని.. సినిమా బాగా తీశారని ప్రశంసించారట జగన్. ఇక అటు చిరు కూడా.. రాజకీయాలకు అతీతంగానే తమ భేటీ జరిగిందని.. స్పష్టం చేశారు. అలాగే.. చిరు విజ్ఞప్తి మేరకు.. రెండు, మూడు రోజుల్లో సినిమా చూస్తానని జగన్ చెప్పారట. ఈ మేరకు జగన్.. విజయవాడ పీవీఆర్‌ మాల్‌కి వెళ్లి చూస్తారని సమాచారం.