Shock to Chandrababu: దెబ్బ మీద దెబ్బ… బాబుకు షాకిస్తున్న జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్న తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్‌తో వరుసగా షాకులు తగులుతున్నాయి. రోజుకో నేత పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ గూటికి చేరుతుండడంతో టీడీపీ అధినేత, పార్టీ సినియర్ నాయకులు మధనపడుతున్నట్లు సమాచారం.

Shock to Chandrababu: దెబ్బ మీద దెబ్బ... బాబుకు షాకిస్తున్న జగన్
Follow us

|

Updated on: Mar 12, 2020 | 2:22 PM

TDP leaders are in race to reach YCP: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్న తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్‌తో వరుసగా షాకులు తగులుతున్నాయి. రోజుకో నేత పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ గూటికి చేరుతుండడంతో టీడీపీ అధినేత, పార్టీ సినియర్ నాయకులు మధనపడుతున్నట్లు సమాచారం. లోకల్ పోల్స్‌కు ముందు ఇలా సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా.. వారు వీరు అన్న తేడా లేకుండా వైసీపీ బాట పడుతున్నారు.

ముందుగా ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ముందుగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ గూటికి చేరారు. ఆయన పార్టీ మారిన మర్నాడే.. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలోకి జంప్ అయ్యారు. ఆయన జగన్ సమక్షంలోనే పార్టీ మారారు. నెక్స్ట్ డే.. అంటే మార్చి 12న చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ తనకు చిరకాలంగా తెలుగుదేశం పార్టీతో వున్న అనుబంధాన్ని పక్కన పెట్టి మరీ వైసీపీలోకి చేరిపోయారు. ఆయన్ను బుజ్జగించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో చీరాల నియోజకవర్గం ఇంఛార్జీగా యడం బాలాజీని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు టీడీపీ అధినేత.

మూడు రోజుల్లో ముగ్గురు కీలక నేతలు.. టీడీపీకి గుడ్ బై చెప్పడంతో చంద్రబాబు ఖిన్నుడైనట్లు సమాచారం. మరిన్ని జిల్లాల్లో కీలక నేతలు వైసీపీకి క్యూ కట్టే సంకేతాలున్న నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతోపాటు కీలక నేతలతో భేటీ అయ్యారు. అనుమానంగా వున్న వారి జాబితాను రూపొందించి, వారితో సంప్రదింపులు జరిపే పనిని సీనియర్ నేతలు చంద్రబాబు అప్పగించినట్లు తెలుస్తోంది. అవసరమైన చోట తాను కూడా స్వయంగా వారితో మాట్లాడి భవిష్యత్తుకు భరోసా ఇస్తానని చంద్రబాబు తెలిపినట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు భరోసా ఏ మేరకు క్యాడర్ని, లీడర్లను కాపాడుతుందో వేచి చూడాలి