పోలవరం నుంచి నవయుగ కంపెనీ ఔట్: జగన్ షాకింగ్ నిర్ణయం

పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రక్షాళన మొదలు పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఎక్స్‌పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. ప్రాజెక్టు పనులను చూస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ నవయుగ కంపెనీని తప్పుకోవాలని ఇరిగేషన్ శాఖ ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు పనులకు ఇచ్చిన టెండర్లలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వ నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. ప్రాజెక్టు అంచనా వ్యయం అనూహ్యంగా పెరిగిపోవడం, అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో జగన్ ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ప్రాజెక్టు పనుల, డీపీఆర్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన […]

పోలవరం నుంచి నవయుగ కంపెనీ ఔట్: జగన్ షాకింగ్ నిర్ణయం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 01, 2019 | 8:04 PM

పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రక్షాళన మొదలు పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఎక్స్‌పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. ప్రాజెక్టు పనులను చూస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ నవయుగ కంపెనీని తప్పుకోవాలని ఇరిగేషన్ శాఖ ఆదేశించింది.

పోలవరం ప్రాజెక్టు పనులకు ఇచ్చిన టెండర్లలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వ నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. ప్రాజెక్టు అంచనా వ్యయం అనూహ్యంగా పెరిగిపోవడం, అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో జగన్ ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ప్రాజెక్టు పనుల, డీపీఆర్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణుల కమిటీ రెండు నివేదికల్ని ప్రభుత్వానికి సమర్పించింది. గతంలో ఇచ్చిన టెండర్లలో అక్రమాలు జరిగాయని తేల్చింది. అంతేగాకుండా పాత కాంట్రాక్టర్‌కే ఇస్తారో.. లేక కొత్త కాంట్రాక్టర్‌నే నియమిస్తారో త్వరగా తేల్చాలని కూడా ప్రభుత్వానికి సూచించింది కమిటీ. న్యాయపరమైన చిక్కులు తెలెత్తకుండా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని సిఫార్సు చేసింది.

నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది. నవయుగ సంస్థకు ఇప్పటికే ప్రీక్లోజర్ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టులో హెడ్‌వర్క్స్‌ పనులు చేస్తోంది నవయుగ. 3 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ వర్క్స్‌తో పాటు.. మూడువేల 220 కోట్ల విలువైన విద్యుత్ టెండర్లు కూడా దక్కించుకుంది. ఈ రెండింటి నుంచీ వెంటనే తప్పుకోవాలని ఇరిగేషన్ శాఖ ఆదేశించింది.