Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

జగన్ ఎంత స్ట్రాంగంటే..! ఎల్వీపై బదిలీవేటుకు కారణాలివే..!!

chief minister firm on chief secretary, జగన్ ఎంత స్ట్రాంగంటే..! ఎల్వీపై బదిలీవేటుకు కారణాలివే..!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యంను అకస్మాత్తుగా తొలగించడం రాష్ట్రంలోనే కాదు.. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో.. ఉన్నతస్థాయి ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబుతో వైరం వల్లనో.. లేక మరేదైనా బలమైన కారణమో ఎల్వీకి, ముఖ్యమంత్రి జగన్‌కు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందనే అందరూ అనుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య ఎక్కడ బెడిసింది ? ఎందుకలా అత్యంత వేగమైన నిర్ణయంతో ఎల్వీపై బదిలీ వేటు వేశారు ముఖ్యమంత్రి ? ఇవే ఇప్పుడు హాట్ టాపిక్స్.
బదిలీవేటుకు కారణాలను అన్వేషించిన టీవీ9కు ఆసక్తికరమైన అంశాలు తెలియవచ్చాయి. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళలో అత్యంత సన్నిహితంగా కనిపించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం, జగన్ మోహన్ రెడ్డిల మధ్య గత నెల రోజులుగా క్రమంగా గ్యాప్ పెరుగుతూ వచ్చిందని అమరావతి సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా సమీక్షా సమావేశాల్లో సీఎస్ వ్యవహరిస్తున్న తీరే ఇద్దరి మధ్య గ్యాప్‌కు కారణమైందని తెలుస్తోంది.
సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ సూటిగా.. సుత్తి లేకుండా తన అభిప్రాయాలను క్లుప్తంగా వివరించి, చేయాల్సిన పనులకు, తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి స్ట్రైట్ ఫార్వార్డ్ ఆదేశాలు జారీ చేస్తే.. అందుకు పూర్తి భిన్నంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం సుదీర్ఘ వివరణలతో కాలయాపన చేసేవారని, ఆ తీరు ముఖ్యమంత్రికి నచ్చకపోవడంతో.. చాలా సందర్భాల్లో ఇక చాలు అన్న ధోరణిలో సమీక్షలను కంక్లూజన్‌కు తెచ్చేవారని సమాచారం.
అలా మొదలైన గ్యాప్.. ఆ తర్వాత మరింత ముదరడానికి ఇటీవలి పరిణామాలు దోహడపడినట్లు సమాచారం. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరిట ఏటా రెండు పర్యాయాలు ఎక్స్‌లెన్సీ అవార్డులివ్వ తలపెట్టిన ముఖ్యమంత్రి జగన్ అభిమతానికి అనుగుణంగా నడచుకోకపోవడమే ఎల్వీకి ముఖ్యమంత్రికి మధ్య మరింత గ్యాప్ పెరగడానికి దారి తీసినట్లు తెలుస్తోంది. సంబంధిత ఫైలును ఆర్థిక శాఖ అనుమతి లేదంటూ పెండింగ్‌లో పెట్టడం జగన్‌కు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.
దానికి తోడు ప్రతిభావంతులైన విద్యార్థులకు అబ్దుల్ కలాం పేరిట 2015 నుంచి ఇస్తూ వస్తున్న అవార్డుల పేరును మారుస్తూ జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వులు కూడా కొంత కారణమయినట్లు సమాచారం. నిజానికి ఈ ఉత్తర్వుల జారీతో సీఎస్‌కు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా.. ఈ జివో కారణంగా ముఖ్యమంత్రిపై టిడిపి నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం కూడా జగన్ ఆగ్రహానికి కారణమైనట్లు సమాచారం.
ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలియడంతో విద్యా శాఖ సదరు ఉత్తర్వులను ఉపసంహరిస్తూ.. మరో జీవో జారీ చేసింది. అబ్దుల్ కలాం పేరిటే ప్రతిభా పురస్కారాలు ఇస్తామని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తొలుత పేరు మారుస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పెడుతూ జారీ చేసిన ఉత్తర్వులు తనకు అప్రతిష్ట తెచ్చినట్లు ముఖ్యమంత్రి భావించారని, అందుకు కారణం సీఎస్ నిర్లక్ష్యమేనని ఆయన అనుకోవడంతో ఎల్వీపై ఆయన ఆగ్రహం రెట్టింపైనట్లు తెలుస్తోంది.
ఇక స్పందనపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో జరిగిన సంభాషణ ఇద్దరి మధ్య గ్యాప్‌ను పీక్ లెవెల్‌కు తీసుకెళ్ళిందని తెలుస్తోంది. పేదలకు ఇళ్ళ స్థలాలిచ్చేందుకు అనువైన భూములను శరవేగంగా గుర్తించాలని ముఖ్యమంత్రి జగన్ చెబితే.. ముందుగా డంపింగ్ యార్డులకు స్థలాలను గుర్తించాలని, ఒకసారి నివాస స్థలాలను గుర్తిస్తే.. ఆ తర్వాత డంపింగ్ యార్డులకోసం భూములు దొరకవని ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారని.. తన ముందే తన ప్రియారిటీని తగ్గించే ప్రయత్నం చేయడంతో జగన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైందని సమాచారం.
సీఎంఓలోకి ఓ అదనపు కార్యదర్శిని రప్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ మౌఖిక ఆదేశాలివ్వగా.. సదరు అధికారితో వైరం ఉన్న కారణంగా ఆయన అపాయింట్‌మెంట్‌ను ఎల్వీ తొక్కి పెట్టారని, నియామకానికి సంబంధించిన ఉత్తర్వుల ఫైలు గురించి సిఎంవో ఎన్ని సార్లు అడిగినా కూడా ఎల్వీ స్పందించలేదని, విషయాన్ని జగన్‌కు కొందరు అధికారులు చేరవేయడంతో ఆయన సీరియస్ అయ్యారని చెప్పుకుంటున్నారు.
ఆతర్వాత ఓ జివో విషయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్‌కు సీఎస్ హోదాలో ఎల్వీ జారీ చేసిన షోకాజ్ నోటీస్.. తక్షణ నిర్ణయం తీసుకునేలా ముఖ్యమంత్రిని పేరేపించిందని, ఫలితంగా వెంటనే ఎల్వీని హెచ్ఆర్డీ సంస్థక బదిలీ చేశారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రవీణ్ ప్రకాశ్ జారీ చేసిన జివోపై ఫిర్యాదు రావడంతో దానికి కారణాలు తెలియజేయాలంటూ ప్రవీణ్ ప్రకాశ్‌కు ఎల్వీ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలుండగా సీఎస్ షోకాజ్ ఏంటన్న మేటర్ జగన్ దృష్టికి వెళ్ళడంతో ఆయన సీరియస్ అయ్యారని.. వెంటనే బదిలీ వుత్తర్వులను ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.
మొత్తానికి కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు గత నెల రోజులుగా జరిగిన, జరుగుతున్న పరిణామాలు జగన్‌లో ఆగ్రహానికి కారణమ్యాయని, ఫలితంగానే ఎల్వీపై బదిలీ వేటు పడిందని అమరావతి సచివాలయంలోను.. ముఖ్యంగా సీఎంవోలోను జోరుగా చర్చ జరుగుతోంది.