Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

పవన్ కల్యాణ్ పెళ్ళిళ్ళపై జగన్ సెటైర్.. ఏమన్నారో తెలిస్తే నవ్వాగదు..!

jagan satirical comment on pavan kalyan's three marriages, పవన్ కల్యాణ్ పెళ్ళిళ్ళపై జగన్ సెటైర్.. ఏమన్నారో తెలిస్తే నవ్వాగదు..!

సాధారణంగా ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి కన్నెత్తి చూడని, పల్లెత్తి మాట్లాడని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడు పెళ్ళిళ్ళపై సెటైర్ వేశారు. ముఖ్యమంత్రి యధాలాపంగా చేసిన ఈ కామెంట్లిపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఎవరి పర్సనల్ లైఫ్ వారిది అని కొందరంటుంటే.. ప్రజా జీవితంలో వున్నప్పుడు ఇలాంటివి పడాల్సిందేనని మరికొందరు అంటున్నారు. ఇంతకీ జగన్ చేసిన కామెంట్లేమిటి ?

ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కంపల్సరీ చేసింది జగన్ ప్రభుత్వం. అయితే.. ప్రభుత్వ పాఠశాలలు అందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా లేవని అధికారులు చెప్పడంతో దాన్ని తొలుత 6వ తరగతి దాకా కుదించారు ముఖ్యమంత్రి. అయితే ఈ నిర్ణయంతో తాముు వెనక్కి తగ్గుతున్నట్లు భావించరాదని సీఎం సోమవారం విద్యాశాఖ సమీక్షలో క్లారిటీ ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం 6వ తరగతి వరకు.. ఆ తర్వాత ఒక్కో ఏడు ఒక్కో సంవత్సరం ఇంగ్లీష్ మీడియం పెంచుకుంటూ వెళతామని క్లారిటీ ఇచ్చేశారు.

ఈ సందర్భంగా ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేయడంపై విపక్షాలు చేసిన కామెంట్లను కొందరు గుర్తు చేయడంతో జగన్ పొలిటికల్ సెటైర్స్ వేశారని సమాచారం. ఈ సెటైర్స్ కేవలం పవన్ కల్యాణ్‌పైనే కాకుండా.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టిడిపి అధినేత చంద్రబాబునాయుడులపై కూడా వేశారు. కానీ.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మూడు పెళ్ళిళ్ళపై జగన్ యధాలాపంగా చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి.

‘‘ ఉదాహరణకు పవన్ కల్యాణ్ వున్నారు.. ఆయనకు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి.. నలుగురో అయిదుగురో పిల్లలుండి వుంటారు.. మరి వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో కాకుండా.. తెలుగు మీడియంలో చదువుతున్నారా ?’’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వెంకయ్య, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాలి.. ఏపీలోని పేద పిల్లలేమో తెలుగులో చదువుకోవాలా ? ఇదేం రాజకీయం అని జగన్ కాస్త వ్యంగ్యంగా.. మరికాస్త ఘాటుగా సెటైర్ వేశారు. ఈ వ్యాఖ్యలు జగన్ సమీక్షలో నవ్వులు పూయించగా.. సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలకు దారితీశాయి.