ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్…

ఇక ముందు ప్రతి నెల 1 తేదీనే జీతాలు ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెలా ఒకటినే వారికి కూడా జీతాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది...

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్...
Follow us

|

Updated on: Jul 26, 2020 | 8:17 AM

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక ముందు ప్రతి నెల 1 తేదీనే జీతాలు ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెలా ఒకటినే వారికి కూడా జీతాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల డేటా సక్రమంగా ఉందా, లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ట్రెజరీ అధికారులను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే నెల 1 నుంచి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ద్వారా వేతనాలను చెల్లించనున్నారు.

సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించి కార్పొరేషన్‌ సమర్పించిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల డేటాను పే అండ్‌ అకౌంట్‌ ఆఫీసర్లు పరిశీలించాల్సించి ట్రెజరీ అధికారులు ఫైనల్ చేయనున్నారు.