Breaking News
  • మద్యం ఎక్కువ వినియోగం ఉన్న ప్రాంతాల్లో.. మద్యం షాపులను తగ్గించలేదు-అచ్చెన్నాయుడు. సేల్స్ లేని చోట మాత్రమే షాపులు తగ్గించారు-అచ్చెన్నాయుడు.
  • ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.
  • గుంటూరు: మైనర్‌ బాలికపై అత్యాచార ఘటన చాలా బాధాకరం. అసెంబ్లీలో దిశ బిల్లు పెట్టిన రోజే ఘటన జరగడం దారుణం-చంద్రబాబు దిశ చట్టం తెచ్చారు.. 21 రోజుల్లో ఉరి అన్నారు మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు దిశ విషయంలో చూపిన శ్రద్ధ.. మైనర్‌ బాలికపై ఎందుకు చూపడంలేదు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బాధిత కుటుంబానికి టీడీపీ తరపున రూ.50 వేల ఆర్థికసాయం-చంద్రబాబు.
  • ఆర్టీసీ విలీనంపై టైమ్‌బాండ్‌ పెట్టి కమిటీని నియమించాం-పేర్ని నాని. కమిటీ నివేదిక వచ్చాక ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కొత్త చట్టం తెస్తున్నాం. 200 రోజుల్లోనే జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు-పేర్ని నాని. ఆర్టీసీ విలీనంతో ప్రభుత్వంపై రూ.3,600 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. జనవరి 1లోగా ప్రజా రవాణాశాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం-పేర్ని నాని.
  • రేపు యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన.
  • జులై 1వ తేదీ నాటికి 4,380 షాపులు ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ నివేదిక. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 20శాతం మద్యం షాపులు తగ్గించాం. ప్రస్తుతం 3,456 షాపులకు కుదించాం-సీఎం జగన్‌. 43 వేల బెల్ట్‌ షాపులను ఎత్తివేశాం-సీఎం జగన్‌. ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. సభను తప్పుదోవ పట్టించేలా అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు. అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నా-జగన్‌. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.

అవినీతిపై జగన్మోహనాస్త్రం..రంగంలోకి అహ్మదాబాద్ బ్యాచ్!

jagan sensational decision, అవినీతిపై జగన్మోహనాస్త్రం..రంగంలోకి అహ్మదాబాద్ బ్యాచ్!

అధికారపగ్గాలు చేపట్టినప్పట్నించి అవినీతిరహిత పాలన అందిస్తానంటూ చెబుతూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగానే పక్కా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాజకీయ అవినీతిని పూర్తి అరికట్టగలిగామని చెప్పుకున్న ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగంలోని అవినీతిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. అవినీతి లూప్‌హోల్స్‌ని కనుగునేందుకు జగన్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రభుత్వాధికారులను షాక్‌కు గురిచేస్తోంది.

అహ్మదాబాద్‌లోని ఐఐఎంను రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రభావం చూపుతూ, ప్రభుత్వ లక్ష్యాలను నీరుగారుస్తున్న అవినీతిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని ఐఐఎం(అహ్మదాబాద్)తో ఒప్పందం కుదుర్చుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు రూపొందించిన ఒప్పందంపై ఏపీ ఏసీబీ డైరెక్టర్ జనరల్ విశ్వజిత్, అహ్మదాబాద్ ఐఐఎం చీఫ్ ప్రొఫెసర్ డా.సుందరవల్లి నారాయణ స్వామి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం మేరకు ఏపీలో ప్రభుత్వ పథకాలను, వాటి అమలు తీరుతెన్నులను ఐఐఎం టీమ్ కూలంకషంగా మూడు నెలల పాటు అధ్యయనం చేసి, అవినీతిరహితంగా పథకాలను అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది.

jagan sensational decision, అవినీతిపై జగన్మోహనాస్త్రం..రంగంలోకి అహ్మదాబాద్ బ్యాచ్!

గ్రామస్థాయిలో ఏర్పాటైన సచివాలయాలు, వార్డు సచివాలయాల కారణంగా ప్రభుత్వ పథకాలు గ్రౌండ్ లెవెల్‌లో లబ్దిదారులకు చేరాయని, అయితే కింది స్థాయి అవినీతిని పూర్తిగా అరికడితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తాము భావిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చాలా మటుకు సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నామని జగన్ చెబుతున్నారు. అయితే.. ఇందులో అధికారుల వివక్ష ఎక్కడ చోటుచేసుకుంటుందన్న అంశంపై అధ్యయనం చేయాల్సిందిగా ఐఐఎం ప్రొఫెసర్లను కోరారు ముఖ్యమంత్రి. తాజా ఒప్పందంలో భాగంగా గ్రామ, మండల, డివిజనల్ స్థాయిల్లో రెవెన్యూ, పరిషత్ కార్యాలయాల్లో పరిశీలన కోసం మెకానిజం ఐఐఎం ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత ఏ స్థాయిలోను అధికారులు లంచం కోసం అర్రులు చాచలేని పరిస్థితిని కల్పించేందుకు అవసరమైన చర్యలను ఐఐఎం ఏపీ ప్రభుత్వానికి అందించనుంది.