అమరావతికి లక్ష కోట్లు వ‌ృధా..విశాఖకు పది శాతం చాలు : జగన్ కీలక వ్యాఖ్యలు

రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టాలంటే అమరావతి ప్రాంతంలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వుంటుందని, అదే విశాఖ అయితే కేవలం పది వేల కోట్లతో హైదరాబాద్ నగరాన్ని తలదన్నే స్థాయిలో రాజధానిని నిర్మించుకోవచ్చంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాటి మంత్రివర్గ సమావేశంలో జిఎన్ రావు కమిటీ నివేదికపై చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. జిఎన్ రావు కమిటీ నివేదికాంశాలను పాయింట్ బై పాయింట్ […]

అమరావతికి లక్ష కోట్లు వ‌ృధా..విశాఖకు పది శాతం చాలు : జగన్ కీలక వ్యాఖ్యలు
Follow us

|

Updated on: Dec 27, 2019 | 3:28 PM

రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టాలంటే అమరావతి ప్రాంతంలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వుంటుందని, అదే విశాఖ అయితే కేవలం పది వేల కోట్లతో హైదరాబాద్ నగరాన్ని తలదన్నే స్థాయిలో రాజధానిని నిర్మించుకోవచ్చంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాటి మంత్రివర్గ సమావేశంలో జిఎన్ రావు కమిటీ నివేదికపై చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. జిఎన్ రావు కమిటీ నివేదికాంశాలను పాయింట్ బై పాయింట్ చర్చించిన క్యాబినెట్‌లో మంత్రులు పలు రకాల సూచనలు చేసిన సందర్బంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారని తెలుస్తోంది. రాజధాని తరలింపుపై మంత్రులకు అరగంటపాటు వివరించిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతిలో భారీ ఖర్చుతో భవనాలు నిర్మించినప్పటికీ.. ఇక్కడ వరల్డ్ క్లాస్ నగరాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమని జగన్ చెప్పినట్లు సమాచారం. కనెక్టివిటీ వుంటేనే ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ శాఖలను ఏర్పాటు చేసేందుకు వస్తాయని, ఆ కోణంలో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవసరమని ఆయన అన్నారు. కేవలం పది వేల కోట్ల ఖర్చుతో భవనాలు నిర్మిస్తే.. విశాఖలో ఆల్ రెడీ వున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఏపీ రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుందని జగన్ వివరించినట్లు తెలుస్తోంది.

నిజానికి ఏపీ రాజధానిపై జనవరి నాలుగో తేదీనే స్పష్టమైన ప్రకటన చేయాలని కొందరు మంత్రులు జగన్‌ని కోరినట్లు సమాచారం. మరికొందరు మాత్రం రెండు నివేదికలు పరిశీలించేందుకు హైపవర్ కమిటీకి కొంత సమయం ఇవ్వాలని ఆ తర్వాతే నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇరు అభిప్రాయాలను విన్న తర్వాత రాజధాని తరలింపుపై తమకు తొందరేమీ లేదని, సమగ్ర అధ్యయనం తర్వాతనే నిర్ణయం తీసుకుందామని అని రాజధాని అంశంపై చర్చకు ముఖ్యమంత్రి తెరదించారని అంటున్నారు. అయితే, రాజధాని విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు వివరంగా చెప్పిన తర్వాతనే చర్యలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.