జగన్ మరో సంచలన నిర్ణయం.. పెద్దల సభకు చెక్ !

ఆంధప్రదేశ్‌లో శాసన మండలికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెక్ పెట్టబోతున్నారా? ఆ దిశగా చర్యలు ఆల్ రెడీ ప్రారంభం అయ్యాయా? పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తుందంటున్నారు పరిశీలకులు. మండలిలో సభ్యుల సంఖ్యపరంగా టీడీపీకి భారీ ఆధిక్యం వుండడం వల్లనే మండలి రద్దు అంశం ప్రతిపాదనకు వచ్చిందని తెలుస్తోంది. ఏపీ శాసన సభలో 151 సభ్యులతో బంపర్ మెజారిటీ కలిగి వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో కేవలం తొమ్మిదంటే తొమ్మిది మంది ఎమ్మెల్సీలు మాత్రమే […]

జగన్ మరో సంచలన నిర్ణయం.. పెద్దల సభకు చెక్ !
Follow us

|

Updated on: Dec 19, 2019 | 1:37 PM

ఆంధప్రదేశ్‌లో శాసన మండలికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెక్ పెట్టబోతున్నారా? ఆ దిశగా చర్యలు ఆల్ రెడీ ప్రారంభం అయ్యాయా? పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తుందంటున్నారు పరిశీలకులు. మండలిలో సభ్యుల సంఖ్యపరంగా టీడీపీకి భారీ ఆధిక్యం వుండడం వల్లనే మండలి రద్దు అంశం ప్రతిపాదనకు వచ్చిందని తెలుస్తోంది.

ఏపీ శాసన సభలో 151 సభ్యులతో బంపర్ మెజారిటీ కలిగి వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో కేవలం తొమ్మిదంటే తొమ్మిది మంది ఎమ్మెల్సీలు మాత్రమే వున్నారు. మొత్తం సభ్యుల సంఖ్య 58 కాగా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కేవలం 9 మంది మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే సమయంలో 30 మంది తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీలున్నారు. మిగిలిన వారు వివిధ రంగాలకు చెందిన నామినేటెడ్ సభ్యులు, ఉపాధ్యాయ, పట్టభద్రుల సంఘాల తరపున ఎన్నికైన వారు. దాంతో ముందు ముందు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే సంకేతాలున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శాసనమండలిని రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి 58 మంది సభ్యులున్న ఏపీ శాసనమండలిలో 2021 నాటికి మూడొంతుల మంది రిటైర్ అవుతారు. ఖాళీ అయ్యే సీట్లలో దాదాపు 15 మందిని అధికార పార్టీ గెలిపించుకునే పరిస్థితి వుంది. అందుకు తగిన బలం శాసనసభలో వైసీపీకి వుంది. అయినప్పటికీ… మండలిలో అధికార పార్టీకి పూర్తిస్థాయి బలం చేకూరదు. (9+15 = 24 సగం కంటే తక్కువే) దీన్ని అధిగమించాలంటే టీడీపీ ఎమ్మెల్సీలను ఆకర్షించాల్సిన అవసరం వైసీపీకి వుంది. ఎవరు పార్టీ మారినా పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ సూచిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలు వైసీపీలో చేరినా వారు తిరిగి ఎన్నికయ్యే పరిస్థితి అంతంతమాత్రమే. ఈ రకంగా 2023 దాకా శాసనమండలిలో టీడీపీకే అధిపత్యం వుండే పరిస్థితి కనిపిస్తోంది.

తాజాగా రాజధానిపై చేసిన ప్రకటన సహా పలు అంశాలపై జగన్ ప్రభుత్వంతో విభేదిస్తోంది విపక్ష తెలుగుదేశం పార్టీ. మరో రెండు నెలల్లో ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టే ఛాన్స్ వుంది. శాసనసభలో నెగ్గిన బిల్లులను మండలిలో నెగ్గించుకోవడం ప్రభుత్వానికి సవాల్ మారనుంది. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాలంటే మండలిలో టీడీపీ సభ్యులు ప్రతీ బిల్లుకు ఓటింగ్ కోసం పట్టుబట్టి, ఓడిస్తే… ఆ బిల్లులు పెండింగ్‌లో పడతాయి. దాంతో పరిపాలన ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఒక రకంగా అది జగన్ ప్రభుత్వానికి ఎంబరాసింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్లవుతుంది. ఈ పరిస్థితిని తప్పించాలంటే మండలిని రద్దు చేయడమే మంచి పని అని పలువురు జగన్‌కు సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ సలహాపై న్యాయనిఫుణులతో జగన్ చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తారని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

1985లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు.. మండలిలో కాంగ్రెస్ సభ్యులు ఇబ్బందులకు గురిచేయడంతో ఏకంగా శాసన మండలిని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నా మండలిని రద్దు చేస్తూ ఏపీ శాసనసభ పంపిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత 2004 అధికారంలోకి వచ్చిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. 2007లో మండలిని పునరుద్దరించారు. ప్రస్తుతం ఏపీ శాసనసభ తీర్మానం చేస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది కూడా చర్చనీయాంశమే.

కమిట్‌మెంట్ ఇచ్చిన అవకాశాలు రావడం లేదు.. హిమజ షాకింగ్ కామెంట్స్
కమిట్‌మెంట్ ఇచ్చిన అవకాశాలు రావడం లేదు.. హిమజ షాకింగ్ కామెంట్స్
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల.. లిస్టులో బాలీవుడ్ నటి కూడా
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల.. లిస్టులో బాలీవుడ్ నటి కూడా
మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. తొమ్మిది మంది గుర్తింపు వెల్లడి
మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. తొమ్మిది మంది గుర్తింపు వెల్లడి
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ముక్కంటి సాక్షిగా ఆ ఇద్దరి మధ్య పోటీ.. సవాల్ రాజకీయాలు షురూ..
ముక్కంటి సాక్షిగా ఆ ఇద్దరి మధ్య పోటీ.. సవాల్ రాజకీయాలు షురూ..
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
శ్రీరామునికి రెండు సార్లు కళ్యాణం.. ఆ తరువాతే గ్రామంలో పెళ్లిళ్లు
శ్రీరామునికి రెండు సార్లు కళ్యాణం.. ఆ తరువాతే గ్రామంలో పెళ్లిళ్లు
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ఇలా ఉన్నారేంట్రా బాబూ.! వరదలను ఇలాక్కుడా వాడుకోవచ్చా..
ఇలా ఉన్నారేంట్రా బాబూ.! వరదలను ఇలాక్కుడా వాడుకోవచ్చా..
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ