ఆ ఎంపీపై జగన్ ఫైర్?

కియా కార్ల ఆవిష్కరణ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ప్రొటోకాల్ ను గౌరవించి ఆయనకు దేశంలోని ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆహ్వానం అందిస్తే అక్కడ అసందర్భంగా ప్రవర్తించి పార్టీకి అప్రతిష్ట కలిగేలా  ప్రవర్తించారు. అంతేగాకుండా జగన్ నిర్ణయాలను కూడా వక్రీకరించి మాట్లాడారు. మాధవ్ వ్యవహరించిన తీరు సాటి వైకాపా నేతలనే విస్మయానికి గురిచేసింది అంటే… మాధవ్ ఎంత పెద్ద తప్పు చేశారో అర్థమవుతుంది. కియాలో స్థానికేతరులకే అత్యధిక […]

ఆ ఎంపీపై జగన్ ఫైర్?
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2019 | 2:00 AM

కియా కార్ల ఆవిష్కరణ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ప్రొటోకాల్ ను గౌరవించి ఆయనకు దేశంలోని ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆహ్వానం అందిస్తే అక్కడ అసందర్భంగా ప్రవర్తించి పార్టీకి అప్రతిష్ట కలిగేలా  ప్రవర్తించారు. అంతేగాకుండా జగన్ నిర్ణయాలను కూడా వక్రీకరించి మాట్లాడారు. మాధవ్ వ్యవహరించిన తీరు సాటి వైకాపా నేతలనే విస్మయానికి గురిచేసింది అంటే… మాధవ్ ఎంత పెద్ద తప్పు చేశారో అర్థమవుతుంది.

కియాలో స్థానికేతరులకే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చారన్న మాట నిజమే అయినా దానిపై అంతర్జాతీయ మీడియా ముందు అసందర్భంగా వ్యక్తీకరించడం – ప్రభుత్వ ఉద్దేశాలు పారిశ్రామిక వేత్తలకు తప్పుగా అర్థమయ్యేలా మాధవ్ ప్రవర్తించిన తీరుపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే… కొత్తగా పెట్టే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్నది నిబంధన. ఇప్పటికే నెలకొల్పిన కంపెనీలు దశల వారీగా స్థానికులను ఎక్కువగా తీసుకోవాలనేది నిబంధన. దీనికి దాదాపు మూడేళ్ల సమయం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికిపుడు పాత వారిని తీసేసి కొత్తగా స్థానికులను తీసుకోవాలంటే… కంపెనీ అన్నిరకాలుగా నష్టపోతుంది. అందుకే ప్రభుత్వం నిర్ణీత గడువు ఇస్తూ నిబంధనలు రూపొందించింది.

కియా ప్రతినిధులతో గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటికిపుడు స్థానికులకు అవకాశాలు ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులతో వ్యాఖ్యానించడం – శుభాకాంక్షలు చెప్పాల్సిన చోట నిరసన వ్యాఖ్యలు రాయడం – ప్రతిపక్షం విమర్శలు చేస్తే… ఉద్దేశాన్ని విపులంగా వివరించాల్సిన చోట ముఖ్యమంత్రి జగన్ కు చెప్పి కియా మెడలు వంచిస్తా… ఇంకా చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారు అని అనడం వైసీపీకి – రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఉంది. అందుకే ఈ విషయంలో ఎంపీ కి చీవాట్లు తప్పవని తెలుస్తోంది. తనను కలవాలని గోరంట్ల మాధవ్ కు ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??