మంచి మనసును చాటుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

Jagan helps cancer patient shows his compassionate side, మంచి మనసును చాటుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

విశాఖపట్నం: ఏపీ నూతన సీఎం జగన్ పాలనలో తన పంథా చూపిస్తూ ముందుకు సాగిపోతున్నారు. మరోవైపు వ్యక్తిగతంగానూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌ తిరిగి వెళుతుండగా రోడ్డు పక్కన.. ‘బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి’ అంటూ ప్లకార్డులు పట్టుకున్న కొంతమంది యువతీ యవకులు కనిపించారు. వీరిని చూసిన జగన్‌ వెంటనే కాన్వాయ్‌ ఆపించి కిందికి దిగి నేరుగా వారి వద్దకు వెళ్లారు.

కేన్సర్‌తో బాధ పడుతున్న తమ స్నేహితుడు నీరజ్‌ ఆపరేషన్‌కు రూ. 25 లక్షలు ఖర్చవుతుందని, 30 తేదీలోగా అతడికి ఆపరేషన్‌ చేయించాలని సీఎంకి వారు  చెప్పారు. వెంటనే  స్పందించిన ఆయన.. ఆపరేషన్‌కు వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌కు ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి మానవత్వంతో స్పందించి తమ స్నేహితుడికి సాయం చేస్తామని చెప్పడంతో నీరజ్‌ మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. జగన్‌ మనసుకు పలువురు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గ్రేట్ లీడర్ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *