Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం 18 లక్షల 55 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 1855746 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 586298 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 1230510 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 38938 దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 52050 కరోనా కేస్ లు, 803 మంది మృతి
  • అమరావతి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకే దిశ చట్టం తీసుకొచ్చాం అన్నారు దిశ స్టేషన్లు పెట్టాం అని ప్రచారం చేసుకొంటుంది ప్రభుత్వం గిరిజన మహిళలపై దాష్టీకాలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకొనేందుకు పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రచారం తప్ప మహిళల మానప్రాణాలకు రక్షణ లభించడం లేదు. గిరిజన మహిళ శ్రీమతి రమావత్ మంత్రుబాయిని అధికార పార్టీకి చెందిన ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేయడం అమానవీయం. ఆ ఘటన గురించి తెలుసుకొంటే హృదయం ద్రవించింది. మృతురాలి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
  • అమరావతి : ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం. 3రాజధాని అంశంపై హైకోర్టు విచారణ. రాజధాని తరలింపుపై స్టే ఇచ్చిన హైకోర్టు. గవర్నర్ గెజిట్ పై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్ట్.
  • రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించిన హైకోర్టు. 10 రోజులపాటు స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతున్న హైకోర్టు. రెండు బిల్లులకు సంబంధించి ఇదివరకే గెజిట్‌ విడుదల. తదుపరి కార్యకలాపాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు.
  • సింగ‌ర్ స్మిత‌కు కోవిడ్ పాజిటివ్‌: పాప్ సింగ‌ర్ స్మిత‌కు కోవిడ్ పాజిటివ్‌. కోవిడ్్ ల‌క్ష‌ణాలు లేవ‌ని ట్వీట్‌. ఒళ్లు నొప్పులు ఉండ‌టంతో ఎందుకైనా మంచిద‌ని ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్టు వెల్ల‌డి. ఇంట్లో సేఫ్‌గానే ఉన్న‌ప్ప‌టికీ త‌మ‌కు క‌రోనా సోకింద‌న్న స్మిత‌. త్వ‌ర‌లో క‌రోనాను జ‌యించి ప్లాస్మా దానం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ట్వీట్.
  • ఇవాళ యూపీఎస్సీ సివిల్స్-2019 ఫలితాలు వెలువడ్డాయి. సిద్ధిపేటకు చెందిన మంద మకరంద్ ఆలిండియా స్థాయిలో 110వ ర్యాంక్ సాధించాడు. మొత్తం 829 మంది సివిల్ సర్వీసులకు ఎంపికవగా, మకరంద్ మెరుగైన ర్యాంక్ అందుకున్నాడు. దీనిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన సిద్ధిపేట బిడ్డ మంద మకరంద్ కు హార్దిక శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ఖ్యాతిని దేశ స్థాయిలో నిలిపాడంటూ మకరంద్ ను అభినందించారు.
  • నల్గొండ : మర్డర్ సినిమా పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అమృత ప్రణయ్. జీవితాలతో సినిమా దర్శకులు నిర్మాత చెలగాటమాడుతున్నారు అంటూ ఆవేదన. మా అనుమతి లేకుండా మా పేర్లు మా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆదారంగా మర్డర్ సినిమా తీసి తమ జీవితాలపై ప్రభావం చూపుతున్నారని మర్డర్ సినిమా దర్శక, నిర్మాతలపై అమృత ప్రణయ్ అభ్యంతరం.

YS Viveka Murder Case: సీబీఐ దర్యాప్తునకు సీఎం నో

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పినతండ్రి వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్‌ను సర్కార్ తోసిపుచ్చింది.
jagan rejects cbi inquiry, YS Viveka Murder Case: సీబీఐ దర్యాప్తునకు సీఎం నో

Jagan government rejected a proposal to handover Viveka murder case to CBI: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పినతండ్రి వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్‌ను సర్కార్ తోసిపుచ్చింది. ఇప్పటికే నియమించిన సిట్ త్వరలోనే దర్యాప్తును పూర్తి చేయనుందని, కేసు తేలిపోయే సమయంలో సీబీఐ దర్యాప్తు అనవసరమని జగన్ ప్రభుత్వం అమరావతి హైకోర్టుకు వివరించింది. ఈ మేరకు ఏపీ అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదనలు వినిపించారు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు గురువారం విచారించింది. ఈ హత్యకేసు దర్యాప్తుపై అనుమానాలున్నాయని, అందుకే సీబీఐ విచారణను కోరుతున్నామని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాదితో విభేదించిన ఏపీ అడ్వకేట్ జనరల్ వివేకా హత్యకేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్ త్వరలోనే చార్జ్ షీట్ దాఖలు చేయబోతోందని, దర్యాప్తు చివరి దశలో వుందని ఏజీ కోర్టుకు విన్నవించారు.

ఒకవైపు దర్యాప్తు ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో సిబిఐ విచారణ అవసరం ఏంటని ఏజీ అన్నారు. ఇప్పటి వరకు జరిగిన సిట్ దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో ఏజీ కోర్టుకు అందజేశారు. సిట్ దర్యాప్తు చేసిన సిడి, జీడీ ఫైలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి..విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.

Also read: New trend among Telangana Congress leaders

Related Tags