తీర్మానమా? బిల్లా? రాజధానిపై సర్కార్ మీమాంస

ఏపీ రాజధానిని మూడు భాగాలు చేసి… అమరావతి, విశాఖపట్నం, కర్నూలు నగరాల్లో నెలకొల్పాలని సంకల్పించిన జగన్ ప్రభుత్వం దానికి శాసనసభలో ఏ రూపంలో ఆమోదం పొందాలనే విషయంలో మీమాంసలో పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శాసనసభలో కేవలం తీర్మానం చేసి… కేంద్రానికి, సుప్రీంకోర్టుకు పంపితే సరిపోతుందా? లేక మూడు రాజధానులను క్లియర్ కట్‌గా డిఫైన్ చేస్తూ బిల్లు ఆమోదింప చేసుకుని తగిన విధంగా ముందుకెళ్ళడమా? ఈ రెండంశాలపై ఇప్పుడు జగన్ ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. విభజిత […]

తీర్మానమా? బిల్లా? రాజధానిపై సర్కార్ మీమాంస
Follow us

|

Updated on: Jan 18, 2020 | 5:08 PM

ఏపీ రాజధానిని మూడు భాగాలు చేసి… అమరావతి, విశాఖపట్నం, కర్నూలు నగరాల్లో నెలకొల్పాలని సంకల్పించిన జగన్ ప్రభుత్వం దానికి శాసనసభలో ఏ రూపంలో ఆమోదం పొందాలనే విషయంలో మీమాంసలో పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శాసనసభలో కేవలం తీర్మానం చేసి… కేంద్రానికి, సుప్రీంకోర్టుకు పంపితే సరిపోతుందా? లేక మూడు రాజధానులను క్లియర్ కట్‌గా డిఫైన్ చేస్తూ బిల్లు ఆమోదింప చేసుకుని తగిన విధంగా ముందుకెళ్ళడమా? ఈ రెండంశాలపై ఇప్పుడు జగన్ ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిని ఎంపిక చేసుకునే బాధ్యతను 2014లో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి అప్పగించింది రాష్ట్ర విభజన చట్టం. దానికి అనుగుణంగానే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకుంది. దానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం తీసుకుంది. అయితే.. ఒకసారి రాజధానిగా నోటిఫై అయిన దాన్ని మార్చాలంటే శాసనసభలో రాజధాని బిల్లును ప్రవేశ పెట్టాలా? లేక తీర్మానం చేస్తే సరిపోతుందా అన్నదిపుడు సవాల్‌గా మారింది.

ఒక బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారాలంటే.. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ సంతకంతోనే నోటిఫై అవుతుంది. అసెంబ్లీలో 151 మంది సొంత ఎమ్మెల్యేలు, ఇద్దరు బోనస్ ఎమ్మెల్యేలతో కలిపి 153 మంది ఎమ్మెల్యేల బలంతో జగన్ సర్కార్ బంపర్ మెజారిటీ కలిగి వుంది. కానీ.. శాసన మండలి విషయానికి వచ్చే సరికి అధికార పార్టీ పరిస్థితి దారుణంగా వుంది. మొత్తం 58 మంది సభ్యులున్న ఏపీ శాసన మండలిలో అధికార పార్టీకి వున్నది కేవలం ఆరుగురు సభ్యులు. విపక్ష టీడీపీకి 29 మంది సభ్యుల బలం వుండగా.. బీజేపీకి ఇద్దరు, పీడీఎఫ్‌కు ముగ్గురు, స్వతంత్రులు అయిదుగురు వున్నారు. అయిదు స్థానాలు ఖాళీగా వున్నాయి. మరో ఎనిమిది మంది నామినేటెడ్ సభ్యులున్నారు.

శాసనమండలిలో బిల్లు ఆమోదింపచేసుకోవడం జగన్ ప్రభుత్వానికి దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే.. 29 మంది వున్న టీడీపీ, ఇద్దరు సభ్యులున్న బీజేపీ రాజధాని వికేంద్రీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బిల్లు నెగ్గించుకుని, మండలిలో భంగపడేందుకు అవకాశమున్న బిల్లు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ మొగ్గు చూపకపోవచ్చని అంటున్నారు. అయితే. బిల్లుకు బదులుగా.. కేవలం అసెంబ్లీ తీర్మానం చేసి… దానిని కేంద్రానికి పంపి నోటిఫై చేయించుకుంటే సరిపోతుందన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి వున్నట్లు చెబుతున్నారు. దీని వల్ల మరో ప్రయోజనం కూడా వుండడంతో తీర్మానానికే ముఖ్యమంత్రి మొగ్గుచూపుతారని అంటున్నారు. హైకోర్టు షిఫ్టింగ్ కోసం, వేర్వేరు నగరాల్లో బెంచ్‌లను ఏర్పాటు చేసేందుకు తీర్మానం ఉపయోగపడుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుండడంతో దానికి సీఎం ఓటేశారని, ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.

పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..