జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలకు రంగం సిద్ధం..

ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కు నైపుణ్యాభివృద్ధి పెంపొందించడానికి వీలుగా రాష్ట్రంలో 30 స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రంగం సిద్దం చేశారు.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలకు రంగం సిద్ధం..
Follow us

|

Updated on: Jun 20, 2020 | 12:48 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందించారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కు నైపుణ్యాభివృద్ధి పెంపొందించడానికి వీలుగా రాష్ట్రంలో 30 స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేశారు. వీటి నిర్మాణ వ్యయం సుమారు రూ. 1210 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో అధికారులు సీఎం జగన్‌కు కాలేజీల బ్లూ ప్రింట్స్‌ను చూపించారు. పోటీ ప్రపంచాన్ని ధీటుగా ఎదుర్కునేలా ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివిన విద్యార్ధులను సిద్దం చేయాలని వారికి జగన్ తెలిపారు. విద్యార్థులకు ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీల ద్వారా 20 రంగాలకు చెందిన పలు కీలక అంశాలపై నైపుణ్యాభివృద్ధి కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. ఇక ఈ కాలేజీల్లోని నైపుణ్యాల అభివృద్ధి కోర్సుల్లో అంతర్జాతీయ కంపెనీలైన కియా, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్‌, వోల్వో, ఐటీసీలను భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు.

Also Read: ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు.!