ఏపీ లాయర్లకు గుడ్ న్యూస్.. ‘వైఎస్సార్ లా నేస్తం’ నిధులు విడుదల..

ఏపీ లాయర్లకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మార్చి నుంచి జూన్ వరకు ‘వైఎస్సార్ లా నేస్తం’ నిధులు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెలలకు గానూ సుమారు రూ.2.91 కోట్ల రూపాయలను 5,832 మంది జూనియర్ న్యాయవాదుల బ్యాంక్ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. కాగా, వృత్తిలో నిలదొక్కుకునేందుకు జూనియర్ న్యాయవాదులకు అండగా ఉండేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్ లా నేస్తం’ పధకానికి శ్రీకారం చుట్టిన […]

ఏపీ లాయర్లకు గుడ్ న్యూస్.. 'వైఎస్సార్ లా నేస్తం' నిధులు విడుదల..
Follow us

|

Updated on: Jul 08, 2020 | 12:37 PM

ఏపీ లాయర్లకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మార్చి నుంచి జూన్ వరకు ‘వైఎస్సార్ లా నేస్తం’ నిధులు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెలలకు గానూ సుమారు రూ.2.91 కోట్ల రూపాయలను 5,832 మంది జూనియర్ న్యాయవాదుల బ్యాంక్ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.

కాగా, వృత్తిలో నిలదొక్కుకునేందుకు జూనియర్ న్యాయవాదులకు అండగా ఉండేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్ లా నేస్తం’ పధకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పధకాన్ని గతేడాది డిసెంబర్ 3న ప్రారంభించారు. జూనియర్ న్యాయవాదులకు ఈ పధకం కింద ప్రతీ నెలా రూ. 5,000 చొప్పున మూడేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయనుంది.

Also Read:

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

ఏపీ ఎంసెట్.. విద్యార్ధులకు చివరి అవకాశం… నేడే ఆఖరు తేదీ..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. 13 జిల్లాల్లో స్పెషల్‌ సబ్‌జైళ్లు ఏర్పాటు..