ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలను విక్రయించేందుకు ఏపీ సర్కారు సంసిద్ధత, ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు

జగన్ సర్కారు మరో సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందుబాటు ధరల్లో ప్రజలకు ఇళ్ల స్థలాలను విక్రయించేందుకు..

  • Venkata Narayana
  • Publish Date - 8:13 pm, Wed, 13 January 21
YS Jagan mohan Reddy

జగన్ సర్కారు మరో సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందుబాటు ధరల్లో ప్రజలకు ఇళ్ల స్థలాలను విక్రయించేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించి భూసేకరణ కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీకి టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్ నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా డీటీసీపీ డైరెక్టర్ వి.రాముడు, ఏపీ హౌసింగ్ బోర్డు వీసీ బి.రాజగోపాల్, ఏఎంఆర్టీఏ జాయింట్ డైరెక్టర్ టి.చిరంజీవిలు వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువరించారు. భూసేకరణకు గాను నగర, పట్టణ ప్రాంతాలతో పాటు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న భూములను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి ఈనెల 21లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.