కుమార్తె పెళ్లిలో.. జగన్ ప్రమాణస్వీకారం లైవ్

YS Jagan, కుమార్తె పెళ్లిలో.. జగన్ ప్రమాణస్వీకారం లైవ్

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయడాన్ని ప్రత్యక్షంగా చూడాలని తెలంగాణలోని ఓ అభిమాని అనుకున్నారు. అయితే అదే రోజున తన కుమార్తె వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది. దీంతో వివాహ మండపంలో ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేసి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వీక్షించే అవకాశం కల్పించారు. సూర్యపేట జిల్లాలోని హుజుర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read: లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

వైఎస్ జగన్ వీరాభిమాని అయి ఇంద్రారెడ్డి కుమార్తె వివాహం గురువారం జరగగా.. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఆయన ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు. దీంతో ఓ వైపు కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపిస్తూనే మరోవైపు తన అభిమాన నేత ప్రమాణస్వీకారాన్ని వీక్షించారు. మరోవైపు పెళ్లికి వచ్చిన బంధువులు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించి, వధూవరులను ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *